Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending news: రూ.18వేలతో అందమైన ఇల్లు.. బెంగళూరు ఉద్యోగి ఆలోచన అదుర్స్.. అసలు విషయం తెలిస్తే అవాక్కే!

హైదరాబాద్‌, బెంగుళూరు వంటి సిటీల్లో నివసించే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వివిధ రకాల ఎంప్లాయిస్‌ వీకెండ్‌లో గ్రామాలు, రిసార్ట్స్‌, హిల్ స్టేషన్స్‌ కోసం వెళ్తూ.. వేల రూపాయలు చెల్లిస్తుంటారు.

Trending news: రూ.18వేలతో అందమైన ఇల్లు.. బెంగళూరు ఉద్యోగి ఆలోచన అదుర్స్.. అసలు విషయం తెలిస్తే అవాక్కే!
Mud House1
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2022 | 8:31 AM

గ్రామాల్లో నివసించేవారు పట్టణాలకు మకాం మార్చాలనుకుంటారు.. కానీ, పట్టణాల్లో నివసించే వారు పల్లెలను ఇష్టపడుతుంటారు. హైదరాబాద్‌, బెంగుళూరు వంటి సిటీల్లో నివసించే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వివిధ రకాల ఎంప్లాయిస్‌ వీకెండ్‌లో గ్రామాలు, రిసార్ట్స్‌, హిల్ స్టేషన్స్‌ కోసం వెళ్తూ.. వేల రూపాయలు చెల్లిస్తుంటారు. బెంగుళూరులోని లీ మెరిడియన్, తాజ్ గేట్‌వే వంటి భారీ హోటళ్లలో ఇప్పుడు 19 ఏళ్లుగా పనిచేసిన మహేష్ కృష్ణన్ అందరిలాగే విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకున్నాడు. అయితే చివరకు బెంగళూరులో బిజీ లైఫ్ బోర్ కొట్టింది. అతను బెంగళూరు నుండి దూరంగా వెళ్లి స్థిరమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. బెంగళూరులో చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పి చామరాజనగర్ లో మట్టి ఇల్లు కట్టుకున్నాడు. చామరాజనగర్‌లోని తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో మట్టి ఇల్లు నిర్మించుకున్నాడు.

Mud House

Mud House

మహేష్ గతంలో కొన్ని వర్క్‌షాప్‌లకు హాజరయ్యాడు. మట్టి, పేడ, రాళ్లు, పొట్టు, తాటి ఆకులు వంటి సహజ పదార్థాలను ఉపయోగించి ఇంటిని నిర్మించడం కోసం అతడు అనేక యూట్యూబ్ వీడియోలను చూశాడు. యూట్యూబ్ వీడియో చూసి కొందరు నిపుణుల సమాచారంతో మట్టి ఇంటిని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకున్నాడు. బెంగళూరులోని చామరాజనగర్‌లో 300 చదరపు అడుగుల ఇంటిని మహేష్ స్వయంగా నిర్మించాడు. ఇప్పుడు కొత్తగా నిర్మించిన మట్టి ఇంట్లో నివసిస్తున్నాడు. సాంప్రదాయ వ్యవసాయం ప్రారంభించాడు. తన సహజ వ్యవసాయంతో సేంద్రియ విధానంలో నిత్యం వినియోగించే కూరగాయలను పండిస్తున్నాడు. ఈ ఇంటిని ఎవరైనా చూడవచ్చు. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ ఇంట్లో ఉచితంగా ఉండేందుకు అనుమతిస్తున్నారు.

Mud Hous F

ఇవి కూడా చదవండి

2019లో చామరాజనగర్‌ అమృత్‌ భూమి ఆర్గనైజేషన్‌లో వాలంటీర్‌గా పనిచేస్తున్నప్పుడు మట్టితో కూడిన ఇల్లు నిర్మించాలని భావించాడు. ఒంటరిగా సంప్రదాయ మట్టి ఇంటిని తయారు చేయగలనా? అని తొలుత సందేహపడ్డాడు.. కానీ, నేను పని చేయడం ప్రారంభించిన తర్వాత, నా విశ్వాసం పెరిగిందని అని చెబుతున్నాడు. ఈ మట్టి గోడలు అందమైన కళాఖండాలతో అలంకరించబడ్డాయి. వేసవి కాలంలో కూడా డాబా సహజంగా చల్లగా ఉంటుంది. కేవలం రూ.18 వేలతో సహజసిద్ధమైన ఇంటిని నిర్మించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి