Funny video: కుక్కపిల్ల సూపర్‌ హీరో.. సుడిగాలినే బంధించి నగరాన్ని విధ్వంసం నుండి కాపాడింది…! ఫన్నీ వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

గత సంవత్సరం, అమెరికాలోని అనేక ప్రావిన్సులలో సుడిగాలి పెను విధ్వంసం సృష్టించింది. చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కూడా తీసింది. గత నెలలో అమెరికాలో వచ్చిన..

Funny video: కుక్కపిల్ల సూపర్‌ హీరో.. సుడిగాలినే బంధించి నగరాన్ని విధ్వంసం నుండి కాపాడింది...! ఫన్నీ వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
Dog Playing
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2022 | 3:25 PM

టోర్నడోలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మన దగ్గర అవి చాలా తక్కువగానే చూస్తుంటాం. కానీ, అమెరికా వంటి విదేశాల్లో ఈ టోర్నడోలు బీభత్సం సృష్టిస్తుంటాయి. వేగంగా, దట్టమైన దుమ్ము దూళితో కలిసి సుడులు తిరుగుతూ వీచే గాలులు.. బలమైన సుడిగాలినే టోర్నడోలు అంటారు. గత సంవత్సరం, అమెరికాలోని అనేక ప్రావిన్సులలో సుడిగాలి పెను విధ్వంసం సృష్టించింది. చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కూడా తీసింది. గత నెలలో అమెరికాలో వచ్చిన టోర్నడోలు బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, అలాంటి టోర్నడోలు కొన్నిసార్లు చాలా చిన్నవిగా కూడా ఉంటాయి. అలాంటివి ఎవరికీ హాని కలిగించదు.. మీరు వాటి మధ్యలోకి వెళ్లి నిలబడినా, కూడా మీకు ఎలాంటి తేడా అనిపించదు. ఇప్పుడు రోడ్డుపై చిన్న టోర్నడో వీడియో వైరల్ అవుతోంది. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఇక్కడ తమాషా ఎంటంటే..ఈ సుడిగాలితో సరదాగా ఆడుకుంటోంది ఓ బుజ్జి కుక్కపిల్ల.

రోడ్డుపై అకస్మాత్తుగా చిన్న టోర్నడో ఏర్పడింది. అంతలోనే ఓ బుజ్జికుక్కపిల్ల అటుగా వచ్చింది. పైపైకి లేస్తున్న సుడిగాలిని అది ఆపాలని ట్రై చేస్తోంది. పదే పదే సుడిగాలిని నోటితో పట్టేయాలని దానితో కుస్తీ పడుతోంది. గాలి పట్టేసేందుకు కుక్క పిల్ల పడుతున్న తంటాలు మామూలుగా లేవు..ఆ గాలి ఎటు వెలితే..అటు పరిగెత్తుకుంటూ వెళ్తోంది. ఆ గాలిని తన నోటితో కొరికేయాలని ప్రయత్నిస్తోంది. దాని పిచ్చిగాకపోతే, ఎక్కడైనా సుడిగాలి కుక్క నోటికి చిక్కుతుందా..? కానీ, కుక్కపిల్ల ఆట మాత్రం భలేగా ఉంది. ఇదంతా వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో జెస్ అనే ఐడి పేరుతో షేర్ చేయబడింది. కుక్క సూపర్ హీరో అయ్యింది. సుడిగాలిని నాశనం చేసి నగరాన్ని విపత్తు నుండి రక్షించింది అంటూ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. షేర్లు, రీ ట్విట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి