Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. ఉద్ధవ్ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
Maharashtra Political Crisis: ఐదు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారణకు సుప్రీంకోర్టు వాయిదా చేసింది. ఏక్నాథ్ షిండేతో పాటు మరో 15 మంది తిరుగుబాటు శాసనసభ్యులపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ జారీ చేసిన అనర్హత నోటీసుకు..,
మహారాష్ట్ర రాజకీయ సమరం హాట్ హాట్‌గా సాగుతోంది. శివసేన నేతలు అజయ్ చౌదరి, సునీల్ ప్రభులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారణకు సుప్రీంకోర్టు వాయిదా చేసింది. ఏక్నాథ్ షిండేతో పాటు మరో 15 మంది తిరుగుబాటు శాసనసభ్యులపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ జారీ చేసిన అనర్హత నోటీసుకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, కేంద్రం, ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో అన్ని పక్షాలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షిండే వర్గానికి చెందిన రెండు పిటిషన్లపై విచారణకు సుప్రీం అంగీకరించింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ ప్రారంభించిన ఎస్సీ, హైకోర్టుకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు.
డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు ఇవ్వడంపై ఏక్‌నాథ్ షిండే వర్గం నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.. డిప్యూటీ స్పీకర్ జిర్వాల్ నిర్ణయాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అటు తమదే అసలైన శివసేన అంటున్నారు ఏక్‌నాథ్ షిండే. శాసనసభా పక్షంలో మూడింట రెండొంతుల మెజారిటీ తమకే ఉండగా లెజిల్లేటివ్ పార్టీ నేతగా మరొకరికి ఎలా అవకాశం ఇస్తారని డిప్యూటీ స్పీకర్‌ని ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేసింది షిండే టీమ్.
Supreme Court issues notice to Deputy Speaker, Secretary of Maharashtra State Legislative Assembly, Centre and others on pleas filed by rebel MLAs against the disqualification notice issued by the Deputy Speaker Narhari Zirwal against Eknath Shinde and 15 other rebel legislators. pic.twitter.com/oYrAKW9CZ4
— ANI (@ANI) June 27, 2022
పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి తమ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, తమ కుటుంబాలకు భద్రత లేకుండా పోయిందని ఆ పిటిషన్‌లో తెలిపారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన బెంచ్ ఈ పిటిషన్లపై విచారించనుంది. ఏక్‌నాథ్ షిండే వర్గం తరపున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంలో వాదిస్తారు. ఇటు శివసేన తరపున అభిషేక్ మను సింఘ్వి కూడా వాదనలు వినిపిస్తారు.