Telangana Corona: తెలంగాణ ప్రజలకు వార్నింగ్.. మరో 6 వారాలు అలెర్ట్‌గా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచన
కరోనా అలెర్ట్.. తెలంగాణ ప్రజలు మరో 6 వారాలపాటు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు డీహెచ్ శ్రీనివాసరావు. మాస్క్ మస్ట్‌గా ధరించాలని, లేకపోతే, వైరస్ బారినపడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో మరో 6 వారాల పాటు కొవిడ్ కేసులు పెరగవచ్చని చెప్పారు, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు. కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేదన్న డీహెచ్, కొత్త వేరియెంట్ వస్తే తప్ప ఫోర్త్‌వేవ్‌కు చాన్స్ లేదన్నారు. కానీ, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తెలంగాణలో కరోనా పరిస్థితుల గురించి టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన డీహెచ్ శ్రీనివాసరావు, మరో 6 వారాల పాటు కొవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. రోజుకు 3 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పండగలు, ఫంక్షన్లలో పాల్గొనేవారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు ఉన్నాయని వెల్లడించారు. అందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు పాటిస్తూ, వైరస్ సోకకుండా చూసుకోవాలని చెప్పారు. అర్హులకు ప్రికాషన్ డోస్ ఇస్తున్నట్టు వెల్లడించారు.
కొత్తగా 496 కరోనా కేసులు
రాష్ట్రంలో 24 గంటల్లో 28,808 మందికి కరోనా టెస్టులు చేయగా.. 496 కొత్త కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినుంచి మరో 205 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,613 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లెలిపింది. కొత్తగా మరణాలు నమోదు కాకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 99.03 శాతంగా ఉంది. మరణాల రేటు 0.51 శాతంగా ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..