AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Health: గర్భిణీ స్త్రీలు ఐదవ నెలలో ఇవి తప్పక పాటించాలి.. లేదంటే సమస్యలు తప్పవు..!

Pregnancy Health: గర్భిణీ స్త్రీలకు ఐదవ నెల చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. మునుపటి నాలుగు నెలల కంటే బేబీ ఎక్కువ వృద్ధి చెందేది ఈ నెలలోనే.

Pregnancy Health: గర్భిణీ స్త్రీలు ఐదవ నెలలో ఇవి తప్పక పాటించాలి.. లేదంటే సమస్యలు తప్పవు..!
Yoga
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 01, 2022 | 9:31 AM

Pregnancy Health: గర్భిణీ స్త్రీలకు ఐదవ నెల చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. మునుపటి నాలుగు నెలల కంటే బేబీ ఎక్కువ వృద్ధి చెందేది ఈ నెలలోనే. శరీర భాగాలు మరింత బలంగా మారుతుంది. ఈ సమయంలో పిండం బలంగా తన్నుతుంది. దీని ద్వారా బేబీ తన ఆవేదనను వ్యక్తపరుస్తుంది.

గర్భిణీ స్త్రీలు ఐదవ నెలలో తమను తాము ఎలా చూసుకోవాలి అనే దానిపై యోగా నిపుణులు కమలా భారతివాజ్ కీలక సలహాలు, సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఐదవ నెలలో కడుపులోని బేబీ కండరాలు అభివృద్ధి చెందుతాయి. తలపై వెంట్రుకలు కనిపిస్తాయి. అందుకే ఈ నెలలో గర్భిణీ స్త్రీలు నెయ్యి, పాలు, అన్నం సమయం ప్రకారం తీసుకోవాలి. అన్నం గంజిలో నెయ్యి, ఉప్పు కలిపి తాగాలి. అలాగే.. పాలు, పంచదార కలిపి బియ్యం, జీడిపప్పు, ద్రాక్ష వేసి పాయసం చేసుకుని తాగాలి.

శిశువు, పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి, జామకాయ పొడిని తేనెతో కలిపి ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. అలాగే, సువర్ణవాజను సేవించాలి. గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు.. పుట్టిన తరువాత శిశువుకు ఇవ్వాలి. అయితే, ఈ ఔషధం ఆయుర్వేద వైద్యుని మార్గదర్శకత్వంలో వేసుకోవాలి.

ఇంతకూ ఎవరీ కమలా భరద్వాజ్.. కమలా భరద్వాజ్ ప్రసిద్ధ యోగా నిపుణురాలు. యోగా సెంటర్ ఆఫ్ ట్రూత్‌ నడుపుతున్నారు. యోగాలో ఎంఎస్సీతో పాటు యోగాలో పీజీ డిప్లొమా కూడా చేశారు. జైన్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2015లో యోగాలో సాధించిన విజయానికి ఆర్యభట్ట అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. యోగా కలశడకి అవార్డు గ్రహీత, జ్యోతిష్య రత్న సహా అనేక కోర్సులు చేశారు. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత సమాచారం కోసం మొ.9663879672కు కాల్ చేయండి. www.astroyoga.co.in ని సందర్శించండి.