- Telugu News Health Health Tips Power packed vegetable juices that kill cancer before it kills human beings
Health Tips: మీకు ఈ విషయం తెలుసా? క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే పవర్ ఫుల్ వెజిటబుల్ జ్యూస్ ఇవే!
టొమాటో అనేక రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా ఔషధంగా పనిచేస్తుంది. కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ..
Updated on: Jul 01, 2022 | 9:59 AM

టొమాటో అనేక రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా ఔషధంగా పనిచేస్తుంది. కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ సహా వివిధ జబ్బుల నుంచి రక్షణనిస్తుంది. అందుకే వారానికి మూడుసార్లు అయినా టొమాటో జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

క్యారెట్‌లో సర్వసాధారణమైన చర్మ క్యాన్సర్ మెలనోమాతో పోరాడే సహజ పోషకాలు ఉన్నాయి. ఈ పదార్ధం ముఖ్యంగా క్యారెట్ తొక్కలో ఉంటుంది. క్యారెట్ జ్యూస్ తాగే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

క్యారెట్, బీట్ రూట్ ఈ రెండూ క్యాన్సర్‌తో పోరాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో పెద్ద మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది.

బీట్‌రూట్ రసం చూడటానికి ఎర్రగా ఉంటుంది. దీనిని కోసినప్పుడు రక్తంలా కనిపిస్తుంది. ఈ కారణంతో చాలా మంది దీనిని తినేందుకు ఇష్టపడరు. అయితే, ఈ బీట్‌రూట్‌లో కేన్సర్‌తో పోరాడే పవర్ హౌస్ ఉంది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.




