National Doctors Day 2022: కరోనాపై పోరులో డాక్టర్ల కీలక పాత్ర.. వారిని వెన్నాడుతున్న పాండమిక్ స్మృతులు
ఈరోజు దేశవ్యాప్తంగా . జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.
National Doctors Day 2022: మానసిక ఆరోగ్యం ప్రస్తుత కాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్య . కరోనా మహమ్మారి కారణంగా ఈ సమస్య చాలా ఎక్కువైంది. ఈ సమస్య ప్రజలకు మాత్రమే కాకుండా.. కరోనా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో రోగులకు చికిత్స చేస్తున్న వైద్యుల మానసిక ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపించిందని తెలుస్తోంది. నిరాశ, భయము, మానసిక ఒత్తిడి వంటి అనేక కేసులు కనిపించాయి. డిప్రెషన్ కేసులు వైద్యుల్లో కూడా కనిపించాయి. వైద్యులు కూడా కరోనా సమయంలో సాధారణ ప్రజల వలే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా . జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. డాక్టర్స్ డే సందర్భంగా కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో వైద్యుల ద్వారా తెలుసుకుందాం.
ఢిల్లీలోని ఆకాష్ హెల్త్‌కేర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ చౌదరి మాట్లాడుతూ.. “కరోనా మహమ్మారి వైద్యుల మానసిక ఆరోగ్యంలై కూడా చాలా ప్రభావం చూపించిందని తెలిపారు. ఎందుకంటే అంటువ్యాధి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, ప్రతిచోటా భారీగా కేసులు నమోదైన సమయంలో వైద్యుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. చాలా మంది వైద్యులు ఆందోళన, నిద్రలేమిని అనుభవించారు. కోవిడ్ కేసులు పెరగడం ప్రారంభించినప్పుడు చాలా మంది వైద్యులు ఆందోళనకు గురయ్యారని చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నందున.. వైద్యుల మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి ఇది చాలా సరైన సమయమని అన్నారు.
వైద్యుల ఆరోగ్యంపై చర్చ తక్కువ
వైద్యులు రోజూ ఆందోళన చెందుతూ ఉంటారని డాక్టర్ ఆశిష్ చెప్పారు. అయితే ఇది చాలా అరుదుగా చర్చించబడుతుంది. వైద్యులు ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. COVID-19 మహమ్మారి సమయంలో 21 దేశాలోని 97,333 మంది వైద్యులు తేలికపాటి డిప్రెషన్ (21.7%), ఆందోళన (22.1%), PTSD (21.5%) అనుభవించారని నివేదిక వెల్లడించింది. పరిశోధనలో పాల్గొన్న వైద్యులందరిలో ట్రామా సంబంధిత ఒత్తిడి కనిపించింది.
ఆరోగ్య కార్యకర్తలు టెలిమెడిసిన్ సహాయం కూడా తీసుకున్నారు
కోవిడ్ కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు చాలా దేశాల్లో టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించబడింది. ఫ్రంట్‌లైన్ వైద్యులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వైద్య చికిత్సనందించారు. ఇది వైద్యుల ఒత్తిడి, ఆందోళనను నియంత్రించడానికి సహాయపడింది.
కరోనా సమయంలో అత్యంత కఠినమైన పోరాటం చేసిన వైద్యులు మాక్స్ వెంటిలేటర్ వ్యవస్థాపకుడు అశోక్ పటేల్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న సమయంలో ప్రజలకు సేవ చేయాలనే తపనను వైద్యులు చూపించిన తీరును ప్రశంసించాల్సిందే అన్నారు. అంటువ్యాధి విరజంభిస్తున్న సమయంలో రోగులకు చికిత్స అందిస్తూ.. చాలా మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఎంతోమంది వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి.. కుటుంబాన్ని త్యాగం చేసి చికిత్సనందించారు. వైద్యుల కృషి కరోనాపై వారి పోరాటం చాలా మంది రోగుల ప్రాణాలను కాపాడింది. కరోనా వైరస్ సమయంలో వైద్యులు ముందు వరుసలో ఉండి.. ఎటువంటి భయం లేకుండా రోగులకు సేవలందించారు. కోవిడ్ నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అటువంటి వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలను చెబుతోంది టీవీ9 వెబ్ సైట్..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..