Subhash Goud |
Updated on: Jul 01, 2022 | 11:23 AM
Sleeping: ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఒత్తిడి, ఆహార నియమాలతోపాటు సరైన నిద్ర లేకపోవడం వల్ల మనిషి ఆనారోగ్యం బారిన పడుతున్నాడు.
కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని తాజాగా అమెరికన్ హార్ట్ అసోషియేషన్(AHA) అధికారికంగా స్పష్టం చేసింది. గుండె, మెదడు ఆరోగ్యవంతంగా పనిచేయడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది.
ప్రతి మనిషికి కనీసం 7 గంటలు నిద్ర పోవడం గుండెకు ఎంతో మంచిదని వెల్లడించింది. ప్రతి రోజూ రాత్రి 7-9 గంటలు సరిపడా నిద్ర వ్యవధి అని, పిల్లలు అంతకు ఎక్కువ, ఐదేండ్ల లోపు చిన్నారులకు 10-16 గంటల నిద్రను సిఫారసు చేసింది.
ఈ మేరకు ఏహెచ్‌ఏ తాజాగా బుధవారం ప్రచురించిన తన జర్నల్‌లోని హార్ట్ హెల్త్ చెక్‌లిస్టులో నిద్ర వ్యవధిని కూడా చేర్చింది. మనిషికి నిద్ర ఎంతో ముఖ్యమని, సరైన నిద్ర లేని కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదమని తెలిపింది అమెరికన్ హార్ట్ అసోషియేషన్.