Viral: వామ్మో.! మరీ ఇంత గూడుపుఠాణీనా.. దొంగచాటు యవ్వారం చూసి పోలీసులకు షాక్!
'పుష్ప' సినిమాలోని పుష్పరాజ్ మాదిరిగా.. కొత్త కొత్త ఐడియాలతో వీరంతా తమ దండాను కొనసాగిస్తూ అటు పోలీసులు...
నిజంగా డ్రగ్స్ పెడ్లర్స్, స్మగ్లర్స్, అక్రమంగా మద్యం రవాణా చేసే కేటుగాళ్లు క్రియేటివ్ బ్రెయిన్ ఉపయోగిస్తున్నారా.? లేక సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. ‘పుష్ప’ సినిమాలోని పుష్పరాజ్ మాదిరిగా.. కొత్త కొత్త ఐడియాలతో వీరంతా తమ దండాను కొనసాగిస్తూ అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులను విస్మయానికి గురి చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో డ్రగ్స్, అక్రమ మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి.
తాజాగా కోట్‌ఖాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రైడ్‌లో దొరికిన 800 మద్యం సీసాలు, 60 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో మండీ ప్రాంతంలో కల్తీ మద్యం తాగి 7 మంది మృతి చెందారు. అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమ మద్యం కేసులపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ నిరంతరం చర్యలు చేపట్టడం గమనార్హం. అక్రమ మద్యం విక్రయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను వదిలే ప్రసక్తి లేదని పోలీసులు చెబుతున్నారు.