AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పాఠాలు చెప్పలేదు.. మనసాక్షి ఒప్పుకోవడం లేదంటూ .. రూ.24 లక్షల జీతం తిరిగి ఇచ్చిన ప్రొఫెసర్‌.. ఎక్కడంటే

బోధించకుండా జీతం తీసుకోవడానికి నా మనస్సాక్షి అనుమతించదు," అని లాలన్ కుమార్ అన్నారు, "ఆన్‌లైన్ తరగతుల సమయంలో కూడా, హిందీ తరగతులకు కొద్దిమంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు."

Viral News: పాఠాలు చెప్పలేదు.. మనసాక్షి ఒప్పుకోవడం లేదంటూ .. రూ.24 లక్షల జీతం తిరిగి ఇచ్చిన ప్రొఫెసర్‌.. ఎక్కడంటే
Lalan Kumar Salary
Surya Kala
|

Updated on: Jul 07, 2022 | 2:58 PM

Share

Viral News: మానవ జీవితాన్ని కరోనాకి ముందు.. తర్వాత కింద చెప్పుకోవాలేమో.. రెండున్నరేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆర్ధిక, పారిశ్రామిక, వైద్య, విద్యా రంగాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా విద్యారంగంపై భారీగా ఎఫెక్ట్ పడింది.  కరోనా మహమ్మారి పుణ్యమాని.. రెండేళ్లుగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినప్పటికీ హాజరైంది అరకొరా విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేకపోయానంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ కాలేజీ ప్రొఫెసర్‌. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా జీతం తీసుకొనేందుకు తన మనస్సాక్షి అంగీకరించలేదంటూ దాదాపు 24లక్షల రూపాయలను వెనక్కి ఇచ్చేశారు. బీహార్‌ ముజఫర్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ కళాళాలలో పనిచేస్తున్న లలన్‌ కుమార్‌ అధ్యాపకులు.. నిజాయతీకి నిలువుటద్దంగా నిలిచారు.

బీహార్‌కు చెందిన 33 ఏళ్ల లలన్‌ కుమార్ ఢిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ నుంచి హిందీలో మాస్టర్స్,ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ముజరఫర్‌పూర్‌లోని నితిశేశ్వర్‌ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2019 సెప్టెంబరులో లలన్‌ ఉద్యోగంలో చేరగా.. ఆ తర్వాత కొన్నాళ్లకే కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్‌డౌన్‌ రావడంతో కాలేజీ మూతబడింది. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినప్పటికీ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో లలన్‌ తన రెండేళ్ల తొమ్మిది నెలల వేతనాన్ని ₹ 23,82,228 లను బీఆర్‌ఏబీయూ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు తిరిగిచ్చేశారు. పాఠాలు చెప్పనప్పుడు జీతం తీసుకొనేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు. అందుకే వేతనాన్ని తిరిగిచ్చేశా’’ అని లలన్ కుమార్ తెలిపారు.

లలన్ కుమార్ చర్యను BRABU రిజిస్ట్రార్ RK ఠాకూర్ ప్రశంసించగా.. కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, ఇది కేవలం పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగానికి బదిలీ చేయడానికి లలన్ కుమార్ పన్నిన ఒక వ్యూహమని అన్నారు. యాదృచ్ఛికంగా, లాలన్ కుమార్ కూడా అకడమిక్స్‌లో  పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగానికి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..