Viral: అత్యంత తెలివైన కుక్క.. మనుషులకే సెల్ప్‌కాన్ఫిడెన్స్ నేర్పిస్తూ..
ఏదైనా సాధించాలంటే ముందు ఆత్మ విశ్వాసం బలంగా ఉండాలి. ఆత్మ విశ్వాసంతో ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ ఆత్మవిశ్వాసం..
ఏదైనా సాధించాలంటే ముందు ఆత్మ విశ్వాసం బలంగా ఉండాలి. ఆత్మ విశ్వాసంతో ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ ఆత్మవిశ్వాసం.. కేవలం మనుషలలో మాత్రమే కాదు జంతువులలోనూ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు నిజమే అని ఒప్పుకుంటారు. ఓ చిన్న కుక్క పిల్ల ధైర్యం చూస్తే షాకవుతారు. పెద్ద గేటును అవలీలగా ఎక్కేసి ఔరా అనిపించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ మైదానంలో చిన్న, పెద్ద కుక్కలు చాలానే ఉన్నాయి. వాటి చుట్టూ ఐరన్ గేట్ అమర్చబడి ఉంది. ఆ గేట్ నుంచి బయటకు వచ్చేందుకు ఆ కుక్క పిల్లలు ప్రయత్నిస్తున్నాయి. అయితే అందులో ఓ చిన్న కుక్కపిల్ల మాత్రం ఏకంగా ఎన్క్లోజర్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ పెద్ద సాహసమే చేసింది. ముందుగా ఆ కుక్క పిల్ల ఐరన్ గేట్ నెమ్మదిగా ఎక్కడం మొదలు పెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో స్టెప్ ఎక్కుతూ గేట్ చివరకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హల్దీ వేడుకతో పెళ్ళి చేసుకున్న స్వలింగ సంపర్కులు.. ఫొటోలు వైరల్
మరో వివాదాస్పద ఫోటోతో.. హిందూ సంఘాలకు కాలేలా చేసిన లీనా..
Pooja Hegde: తమిళ్ స్టార్ హీరోలను మడతెట్టేసిన బుట్టబొమ్మ
Shruti Haasan: ‘తనే నా బెస్ట్’ డార్లింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పిన శ్రుతి..
ఇలాంటి బెల్లీ డ్యాన్స్ సినిమాల్లో చేసుంటేనా.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోయేదిగా !!