Patharchatta Plant Benefits: 100 వ్యాధులకు ఔషధం ఈ ఆకు.. దీనిని పెంచడానికి విత్తనం అవసరం లేదు
ఈ మొక్క ఆకులు రుచిలో పుల్లని, ఉప్పగా ఉంటాయి. మీరు ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. ఆకులో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.
Patharchatta Plant Benefits: ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో దేనికదే చాలా ప్రత్యేకమైనది. అందరినీ ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా చెట్లు, మొక్కల్లో చాలా జాతులు వింత లక్షణాలను కలిగి ఉంటాయి. వీటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ఈ రోజు మనం అలాంటి ఓ మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఒక మొక్కను పెంచాలంటే విత్తనం లేదా ఆ మొక్కను కాండం వంటివి అవసరం అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనం ఓ చెట్టును పెంచుకోవడానికి ఎటువంటి విత్తనం, కాండం అవసరం లేదు.. అటు వంటి మొక్క గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం.. ఒక్క ఆకు తో వేలాది ఆకులు పెరుగుతాయి. కనుక ఇది చాలా ప్రత్యేకమైనది.
ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం Kalanchoe Pinnata Plant, కానీ దీనిని స్థానిక భాషలో స్టోన్‌క్రాప్ లేదా వండర్ ప్లాంట్ అని పిలుస్తారు. ఆయుర్వేద దృక్కోణంలో చూస్తే ఈ మొక్క మీకు ఆరోగ్య బీమాగా భావిస్తారు. ఈ మొక్క ద్వారా మీరు వ్యాధులపై ఖర్చు చేసే డబ్బును ఆదా చేయవచ్చు. దీనిలో అనేక ఔషధ గుణాలతో నిండి ఉండడం వల్ల అనేక పేర్లతో పిలుస్తారు. ఎయిర్ ప్లాంట్, కేథడ్రల్ బెల్స్, లైఫ్ ప్లాంట్, మ్యాజిక్ లీఫ్ మొదలైనవి.
ఈ మొక్క ఆకులు రుచిలో పుల్లని, ఉప్పగా ఉంటాయి. మీరు ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. ఆకులో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. కిడ్నీలో రాళ్ల నుంచి చర్మ సంబంధిత సమస్యలైన ఎగ్జిమా, దద్దుర్లు వంటి వ్యాధులను దూరం చేయడంలో ఈ మొక్క ఎంతగానో సహకరిస్తుంది.
View this post on Instagram
ఈ మొక్క యొక్క వీడియో @nature._.videos అనే ఖాతాతో Instagram లో భాగస్వామ్యం చేయబడింది. ఈ వార్తను లక్షలాది మంది లైక్ చేసారు. ఈ మొక్క ఆకులను తెంచి వేరు చేస్తున్నట్టు క్లిప్ లో చూపించారు. తద్వారా ఈ మొక్కలను మళ్లీ పెంచుకోవచ్చు. ఈ క్లిప్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
(ఈ కథనంలోని విషయాలు సాధారణ ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించబడ్డాయి. వీటిని వైద్య సలహాగా పరిగణించవద్దు. ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించే ముందు ఆరోగ్య నిపుణుల సలహాలను సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది)
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..