Chicken flying: చికెన్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌..! కోళ్లు గాల్లో ఎగిరిపోతున్నాయ్‌.. ఎలాగో చూస్తే షాక్‌ అవుతారు..

వాటి వేగం చూస్తుంటే..పక్షులను మించిపోయి కనిపించింది. ఆమె గనుక అక్కడే నిలబడి ఉండి ఉంటే.. ఖచ్చితంగా ఆమె కోళ్ల కాళ్లకు తగిలి గాయపడి ఉండేది..

Chicken flying: చికెన్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌..! కోళ్లు గాల్లో ఎగిరిపోతున్నాయ్‌.. ఎలాగో చూస్తే షాక్‌ అవుతారు..
Chicken Flying
Follow us

|

Updated on: Jul 11, 2022 | 9:26 AM

Chicken flying: రెక్కలు ఉండి ఎగురుతున్న ఏదైనా జీవిని పక్షి అని పిలుస్తారు. అది తన రెక్కల సహాయంతో ఎంతదూరం అయినా దాటగలదు. అయితే, కొన్ని పక్షులు రెక్కలు ఉన్నప్పటికీ ఎగరలేవు. వీటిలో కోళ్లు ముఖ్యమైనవి. వాటికి రెక్కలు ఉన్నాయి, కానీ వాటి శరీరం బరువైనందున ఎక్కువ ఎగరలేవు. కానీ, ఈజీగా ఎగురుతున్న కోడిని మీరు ఎప్పుడైనా చూశారా..? అయితే ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఈ వీడియోలో ఆహారం కోసం కోడి చాలా ఎత్తు, దూరం వరకు ఎగురుతున్న దృశ్యం అవాక్కయ్యేలా చేస్తుంది.. ఇంతకు ముందు కోడి ఇంత దూరం ప్రయాణించడం మీరు చాలా అరుదుగా చూసి ఉండరు.

మనిషి అయినా, జంతువు అయినా ఆకలిని ఎవరూ సహించరని మనందరికీ తెలుసు. పక్షులు, జంతువుల విషయంలో కూడా అదే జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటపడింది. అందులో కోళ్ల ముందు ఆహారాన్ని విసిరివేస్తుండగా అవి ఎగిరిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియో పౌల్ట్రీ ఫారానికి చెందినదిగా తెలుస్తోంది. ఇక్కడ పని చేసే ఒక మహిళ కోళ్లకు ఆహారం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె వాటిని ఆహారం కోసం పిలిచేందుకు ఓ ప్లెట్‌ను వాయించింది. ఆ తర్వాత వెంటనే కిందకు తల వంచుకుని వేగంగా పక్కకు వెళ్లిపోతుంది. ఆ వెంటనే దూరం నుంచి కోళ్ల మంద గాల్లో ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. వాటి వేగం చూస్తుంటే..పక్షులను మించిపోయి కనిపించింది. ఆమె గనుక అక్కడే నిలబడి ఉండి ఉంటే.. ఖచ్చితంగా ఆమె కోళ్ల కాళ్లకు తగిలి గాయపడి ఉండేది..అందుకే ఆమె తలదించుకుని పరుగున వెళ్లిపోయింది.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. కోళ్ల ఇంత వేగంగా, ఇంత ఎత్తులో కూడా ఎగరగలవా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి