AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JD Lakshmi Narayana: వైసీపీ అవసరం బీజేపీకి ఉంది.. రాష్ట్రం కోసం ఆ డిమాండ్ చేయాలన్న మాజీ జేడీ

విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక హోదాకోసం పార్టీలకు అతీతంగా ఏపీ లో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. 

JD Lakshmi Narayana: వైసీపీ అవసరం బీజేపీకి ఉంది.. రాష్ట్రం కోసం ఆ డిమాండ్ చేయాలన్న మాజీ జేడీ
Cbi Ex Jd Lakshmi Narayana
Surya Kala
|

Updated on: Jul 11, 2022 | 12:29 PM

Share

JD Lakshmi Narayana: మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  ఎక్కడ చూసినా ముందస్తు ఎన్నికల ప్రచారం ఎక్కువగా జరుగుతోందని అన్నారు. ప్రభుత్వాలు ముందస్తు విషయం పక్కన పెట్టి.. అభివృద్ది గురించి పార్టీలు ఆలోచించాలని సూచించారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీల ప్లీనరీల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని కార్యకర్తలకు, నేతలకు పిలుపునిస్తున్నారు. అయితే ఆ ముందస్తు ఎన్నికలు ఎప్పుడనేది చెప్పలేదన్నారు.

రాష్టపతి ఎన్నికల్లో బీజేడీ, వైసీపీ ఇతర పార్టీల మద్దతు బీజేపీకి అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ  ప్రస్తుతం బీజేపీని గట్టిగా డిమాండ్‌ చేసే అవకాశం ఉందని సూచించారు. గతంలో ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం, ఎంపీలు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక హోదాకోసం పార్టీలకు అతీతంగా ఏపీ లో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు.

ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అన్ని పార్టీలు ఆలోచన చేయాలన్నారు. ద్రవ్యోల్బణంపై చర్చ జరగాలని తెలిపారు జేడీ లక్ష్మీనారాయణ. ప్రభుత్వాలు అప్పులు తెచ్చి చేస్తున్న అభివృద్దిపై లెక్కలు చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద కోరతామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గతంలో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత లక్ష్మీ నారాయణ సొంతం పార్టీ పెడతారని విసృతంగా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆ దిశగా అడుగులు మాత్రం ముందుకు పడలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..