Bike Racers: విశాఖలో పెరుగుతున్న బైక్ రేసర్ కల్చర్.. మద్యం మత్తులో యువకులు బీభత్సం.. సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్ ని చితకబాదిన యువత

విశాఖ లో ఎన్నడూ లేని విధంగా వాట్సప్ గ్రూప్ సందేశాలతో ఒక చోట చేరి బైక్ రేసింగ్ లతో వివిధ కళాశాలల విద్యార్థులు భీభత్సం సృష్టించడం పెద్ద యెత్తున చర్చకు దారి తీస్తోంది.

Bike Racers: విశాఖలో పెరుగుతున్న బైక్ రేసర్ కల్చర్.. మద్యం మత్తులో యువకులు బీభత్సం.. సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్ ని చితకబాదిన యువత
Bike Race In Visakha
Follow us
Surya Kala

|

Updated on: Jul 11, 2022 | 11:25 AM

Bike Racers: ప్రశాంత విశాఖ నగరంలో(Visakhapatnam) గతంలో ఎన్నడూ లేని విధంగా బైక్ రేసర్లు స్వైర విహారం చేశారు. 50 ద్విచక్ర వాహనాలలో అన్ని ప్రధాన మార్గాలలో తిరుగుతూ భారీ శబ్దాలతో విపరీతమైన వేగంతో భీభత్సం సృష్టించారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుఝామున 3 గంటల వరకు ఈ భీభత్స కాండ సాగింది. ఆ రహదారిలో వెళ్తున్న ఆర్టీసీ బస్ (RTC bus) సైడ్ ఇవ్వలేదన్న నెపంతో డ్రైవర్ నీ చితక బాదారు మద్యం మత్తులో ఉన్న బైక్ రేసర్లు.

నైట్ రౌండ్స్ ఆఫీసర్లు, నైట్ బీట్ పోలీస్ వ్యవస్థ ఉనికినే ఛాలెంజ్ చేస్తూ అడ్డొచ్చిన వారిపై దాడికి పాల్పడ్డ ఘటనలో చాలా ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు సీసీ ఫోటేజ్ చూసి బిత్తర పోయారు. 24 గంటల తర్వాత డీసీపీ సుమిత్ పేరుతో నిన్న రాత్రి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఘటన పై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ర్యాష్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ యాక్ట్ కింద 5 కేసులు నమోదు చేశారు.

ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడి చేసిన వారిపై మరో కేసు నమోదు, అరెస్టులు చేసినట్టు డిసిపి ఆ ప్రకటనలో తెలిపారు. సెక్షన్ 353,332,IPC 148,149, sec-3 PDPP , పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ యాక్ట్ ల పై కేసులు నమోదు చేసినట్లు ఇప్పటివరకూ 8 మందిని అరెస్ట్ చేయగా మరో 35 మంది కోసం గాలిస్తున్నట్టు వివరించారు. అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసుల ప్రకటించారు. తల్లి తండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని డీసీపీ కోరారు. విశాఖ లో ఎన్నడూ లేని విధంగా వాట్సప్ గ్రూప్ సందేశాలతో ఒక చోట చేరి బైక్ రేసింగ్ లతో వివిధ కళాశాలల విద్యార్థులు భీభత్సం సృష్టించడం పెద్ద యెత్తున చర్చకు దారి తీస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..