AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: అన్నదాతకు అండగా జనసేనాని రైతు భరోసా యాత్ర .. ఈ నెల 16న తూర్పుగోదావరి జిలాల్లో పర్యటన

ఈ నెల 16న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారని పార్టీ శ్రేణులు ప్రకటించాయి. పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. 

Pawan Kalyan: అన్నదాతకు అండగా జనసేనాని రైతు భరోసా యాత్ర .. ఈ నెల 16న తూర్పుగోదావరి జిలాల్లో పర్యటన
Pawan Kalyan
Surya Kala
|

Updated on: Jul 10, 2022 | 7:00 PM

Share

Pawan Kalyan: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర(Koulu Raitu Bharosa Yatra) ను చేయనున్నారు. జిలాల్లో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి.. వారి కుటుంబాల్లో దైర్యం నింపడానికి తలపెట్టిన ఈ యాత్రను ఈ నెల 16న పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారని.. పార్టీ శ్రేణులు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్ మహా యజ్ఞంగా రైతు భరోసా కార్యక్రమం చేపడుతున్నారని కందుల దుర్గేష్ చెప్పారు. రాజమహేంద్రవరం నుండి మండపేటకు చేరుకునే సమయంలో మూడు చోట్ల కౌలు రైతుల కుటుంబాలను పవన్ కలవనున్నారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారని పేర్కొన్నాడు. జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్ధిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులను జనసేనాని అడిగి తెలుసుకుంటారు. ఒక్కో రైతు కుటుంబాలకు రూ. లక్ష రూపాయలు చొప్పున పరిహారం అందిచనున్నారు.. ఇప్పటివరకు 54 మంది రైతుల ఆత్మహత్యలకు సంబంధించి నివేదిక అందయని కందుల దుర్గేష్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.