Janasena: నవరత్నాలపై పవన్ కల్యాణ్ లేవనెత్తిన నవ సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని నాగబాబు డిమాండ్
జనసేన పార్టీ ఆఫీసులో తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో నాగబాబు సమావేశం అయ్యారు. ఈ భేటీలో వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న తీరుని ప్రజాధనం దోచుకుంటున్న విధానాన్ని పార్టీ శ్రేణులు నాగబాబు దృష్టికి తీసుకుని వచ్చారు.
Janasena: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) ప్రభుత్వం పాలనపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై మోయలేని భారం వేస్తూ.. వసూలు చేస్తోన్న పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. అంతేకాదు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నవరత్నాలపై లేవనెత్తిన నవ సందేహాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని జనసేన పిఏసీ సభ్యులు నాగబాబు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఆఫీసులో తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో నాగబాబు సమావేశం అయ్యారు. ఈ భేటీలో వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న తీరుని ప్రజాధనం దోచుకుంటున్న విధానాన్ని పార్టీ శ్రేణులు నాగబాబు దృష్టికి తీసుకుని వచ్చారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వైసీపీ ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని.. ప్రజలను తప్పుదోవ పట్టించిందని అన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి.. ఇప్పుడు రకరకాల సాకులతో సాధారణ ప్రజలకు సంక్షేమ పథకాలను అందకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
సంక్షేమ పథకాలకు జనసేన వ్యతిరేకం కాదని.. ప్రతి పేద కుటుంబానికి రూ. 10లక్షల విలువైన సహాయం అందజేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారని ఈ సందర్భంగా నాగబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు పాలకుల సంపాదన మార్గాలుగా మారకుండా ప్రతి పేద కుటుంబానికి చేరాలనేది.. జనసేన లక్ష్యం అని పేర్కొన్నారు నాగబాబు.