Lover Frogs: వర్షాలకు సందడి చేస్తోన్న కప్పలు.. ఆడకప్పల కోసం రంగు మార్చుకున్న మగ కప్పలు.. వింతగా చూస్తోన్న జనం..
అమ్మాయిల వెంటపడటం కోసం మేకప్ లు, మోడ్రన్ డ్రసులు వేసుకుని వెంటపడే కుర్రాలే కాదు..మేముకూడా ఏమీ తక్కువ కాదంటున్నాయి ఆ రంగులు మార్చే మగకప్పలు
Lover Frogs: ఆడ కప్పల కోసం రంగు మార్చి వేట మొదలు పెట్టిన మగ కప్పలకు ఆడకప్పలు తోడు దొరికాయి. కోనసీమలో సందడి చేసిన పసుపు రంగు కప్పలు ఆడ కప్పల కోసం తన రంగును మార్చుకొని వేట మొదలుపెట్టిన పసుపు కప్పలకు ఆడకప్పలు దొరికాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పసుపు కప్పల సందడి చేయడంతో అంత వింతగా చూశారు. అయితే ఇవి సాధారణ కప్ప లేనని మగ కప్పలు ఆడ కప్పల కోసం రంగులు మార్చి తిరుగుతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పారు. ఖాకీ, ఆలివ్ గ్రీన్ కలర్‌లో ఉండే ఈ కప్పలు సడెన్‌గా ముదురు పసుపురంగులో మారతాయి. ఇలా పసుపు రంగులో మారేవన్నీ మగ కప్పలేనట. ఆడ కప్పలను ఆకర్షించడానికి రంగును మార్చుకుంటాయట.
అయితే అధికారులు చెప్పినట్టుగానే ఆ రంగులు మార్చుకున్న మగ కప్పలకు ఆడ కప్పలు తోడు దొరికాయి. కోనసీమ జిల్లాలోని పలుచోట్ల పసుపు కప్పలు తోడు వెతుకుని ఆడకప్పలతో సంసారం చేస్తున్నాయి. నిన్న పసుపు కప్పలు ఒకటే దర్శనమిచ్చిన చోట నేడు ఆడకప్పలతో కలిసి రెండు సందడి చేశాయి. ఇవి చూసిన జనం మంత్రముగ్ధులవుతున్నారు. అమ్మాయిల వెంటపడటం కోసం మేకప్ లు, మోడ్రన్ డ్రసులు వేసుకుని వెంటపడే కుర్రాలే కాదు..మేముకూడా ఏమీ తక్కువ కాదంటున్నాయి ఆ రంగులు మార్చే మగకప్పలు. మనుషులు, మూగజీవాలు, పక్షులు లకే కాదు చిన్న చిన్న ప్రాణులకు కూడా ప్రేమ ఉంటుందని వీటిని చూస్తే తెలుస్తోంది అంటున్నారు నెటిజన్లు. అయితే, టెర్రిబిల్లిస్ కప్పలు కూడా పసుపు వర్ణంలోనే ఉంటాయి. కొలంబియా అడవుల్లో కనిపించే ఈ కప్పలను గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్స్ అని కూడా పిలుస్తారు.
Reporter: Chakravarthi , TV9 Telugu
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..