Andhra Pradesh: గన్నవరం వైసీపీ అభ్యర్థి అతనే.. ఊహాగానాలపై నోరువిప్పిన మాజీ మంత్రి కొడాలి

దివంగత ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను ఏదో అన్నారని వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు(Chandrababu) .. తన తండ్రి గురించి ఎందుకు చెప్పలేదని తీవ్రంగా విమర్శించారు. వల్లభనేని వంశీ అనారోగ్య కారణాలతో

Andhra Pradesh: గన్నవరం వైసీపీ అభ్యర్థి అతనే.. ఊహాగానాలపై నోరువిప్పిన మాజీ మంత్రి కొడాలి
Kodali Nani Latest
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 01, 2022 | 9:44 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్ పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే తనకు స్వయంగా చెప్పినట్లు వివరించారు. అయితే పోటీ చేస్తున్న వ్యక్తులతో తనకు సంబంధం లేదని, పార్టీ అధినేత ఎవరిని నిలబెడితే వారి విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు. గన్నవరంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సరైన నాయకుడే లేడని ఎద్దేవా చేశారు. దివంగత ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను ఏదో అన్నారని వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు(Chandrababu) .. తన తండ్రి గురించి ఎందుకు చెప్పలేదని తీవ్రంగా విమర్శించారు. వల్లభనేని వంశీ అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా నియోజకవర్గాల ప్లీనరీలు పూర్తి చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. ప్లీనరీకి అతిథిగా హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిని ప్రారంభోత్సవంలో భాగంగా దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేయాలని స్థానిక నాయకులు కోరారు. కాగా.. వారి డిమాండ్ ను మాజీ మంత్రి పట్టించుకోకపోవడం గమనార్హం.

కాగా.. గతంలోనూ టీడీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో పేర్ని నాని పోటీ చేసినా.. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి బరిలో ఉన్నా అండగా నిలబడాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని, ఇల్లరికం అల్లుడిని కాదని అన్నారు. వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు. అన్న కొడాలి.. అంతే కానీ మామా, అల్లుళ్లు కాదన్నారు. వారసత్వమంటే వైఎస్సార్‌.. జగన్‌. సీనియర్‌ ఎన్టీఆర్‌(NTR) జూనియర్‌ ఎన్టీఆర్‌. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకు. రాష్ట్రంలో చంద్రబాబు, బందరులో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు.

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ