‘ఎవరి ఉద్యోగాలు తొలగించం’.. ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రేషనలైజేషన్ జరిగితే ఉద్యోగాలు పోతాయని గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం (జులై 1) క్లారిటీ ఇచ్చారు..

'ఎవరి ఉద్యోగాలు తొలగించం'.. ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
Botsa Satyanarayana
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 01, 2022 | 8:42 PM

AP govt schools Rationalisation 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల రేషనలైజేషన్ ప్రాసెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ రేషనలైజేషన్ ప్రక్రియ జరిగితే ఉద్యోగాలు పోతాయని గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం (జులై 1) క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్లు ప్రభుత్వ పాఠశాలల రేషనలైజేషన్‌లో ఏ ఒక్కరి ఉద్యోగం తొలగించం. రేషనలైజేషన్ జరిగితే ఉద్యోగాలు పోతాయన్న ఆపోహలు వద్దు. కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులను అభద్రతాభావానికి గురిచేసేందుకు అనేక వదంతులు సృష్టిస్తున్నారు. ఈ అవాస్తవ కథనాలపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళన చెందవద్దు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిజేసేందుకు మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాం. అంతేకానీ ఈ విధానం వల్ల ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టును తొలగించడం లేదు. మన ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించేదే తప్పా.. తొలగించే ప్రభుత్వం కాదని మంత్రి బొత్స వివరణ ఇచ్చారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.