AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీ సంఖ్యలో కొత్త కొలువులు.. ఇలా అప్లై చేసుకోండి..

ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ, తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,..

Good News: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీ సంఖ్యలో కొత్త కొలువులు.. ఇలా అప్లై చేసుకోండి..
Ts Govt Jobs
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2022 | 3:59 PM

Share

ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ, తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇది సువర్ణావకాశం. ఇరిగేషన్, ఆర్ డ్ం బి శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి క్లియెరెన్స్ ఇచ్చింది.

ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ ( అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్) లో 1238 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ( ఆర్ అండ్ బి, ఎన్. హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ ఆర్ యూబీ ఎస్, హెచ్ వోడీ) లో284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. వీటితో పాటు డైరెక్టర్ ఆఫ్ వ ర్క్స్ అక్కౌంట్స్ హెచ్ వోడీ లో 53 , డెరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ( హెచ్ వోడీ) లో 88 ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లయింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరి కొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయనుంది.

మొత్తం 1663 ఖాళీల్లో ఇంజినీరింగ్ విభాగంలో..

ఇవి కూడా చదవండి
  • 1,522 పోస్టులు ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆర్థికశాఖ
  • ఇప్పటివరకు 46,998 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి
  • నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ పోస్టుల భర్తీకి అనుమతి
  • నీటిపారుదల శాఖలో 227 ఏఈ పోస్టుల భర్తీకి అనుమతి
  • నీటిపారుదలశాఖలో 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
  • నీటిపారుదలశాఖలో 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
  • భూగర్భ జలశాఖలో 88 పోస్టుల భర్తీకి అనుమతి
  • ఆర్ అండ్ బీలో 38 సివిల్ ఏఈ పోస్టుల భర్తీకి అనుమతి
  • ఆర్ అండ్ బీలో 145 సివిల్ ఏఈఈ పోస్టుల భర్తీకి పచ్చజెండా
  • ఆర్ అండ్ బీలో 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టుల భర్తీకి అనుమతి
  • ఆర్ అండ్ బీలో 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
  • ఆర్ అండ్ బీలో 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  • ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు