Non veg monkey: మాంసాహరిగా మారిపోయిన కోతి.. తిండికోసం ఏం చేస్తుందో చూస్తే షాక్‌ అవుతారు..!

ఆంజనేయుడి ప్రతిరూపంగా భావించే కోతులు ఇలా శాఖహారం నుండి మాంసహరిగా మారిపోవటం చూసి కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలికాలం అంటే ఇదేనేమోనంటూ..

Non veg monkey: మాంసాహరిగా మారిపోయిన కోతి.. తిండికోసం ఏం చేస్తుందో చూస్తే షాక్‌ అవుతారు..!
Monkey
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 02, 2022 | 2:56 PM

సాధారణంగా వానరాలు శాఖాహారులు. అడవిలో దొరికే పండ్లు, కాయలు, కొన్ని రకాల ఆకుల్ని తిని బతికే సాధు జీవులని తెలుసు. కానీ, అంతరించిపోయిన అడవులతో కోతులు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఆహారం కోసం అవస్థలు పడుతున్నాయి. తిండి కోసం ఇళ్లలో దూరి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో కోతులు మనుషులపై కూడా దాడి చేస్తున్నాయి. ఇకపోతే, గతంలో ఓ కోతి కోడిపిల్లల్ని చంపి తింటున్న వైనం కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇక తాజాగా కోతికి సంబంధించి మరో ఘటన వెలుగు చూసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఓ వానరం పూర్తిగా మాంసాహరిగా మారిపోయి ప్రవర్తిస్తోంది. దాన్ని చూసిన స్థానికులు ఇదేక్కడి విచిత్రం అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందంటే…

సాధారణంగా వానరాలు అనగానే..ఏదో ఓ చెట్టు పై కూర్చొని పండో కాయనో తింటుంటాయనే అనుకుంటాం…కానీ, ఈ వానరం మాత్రం ప్రకృతికి విరుద్ధంగా నడుస్తోంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఓ వానరం పూర్తిగా మాంసాహరిగా మారిపోయింది. గతకొద్ది రోజులుగా కోతి కోడి గుడ్లను తింటూ కడుపు నింపుకుంటుంది. కోడి గుడ్ల కోసం ఏకంగా షాపులోనే దొంగతనం చేస్తోంది. షాపుల వద్ద, జనం చేతుల్లో కోడి గుడ్లు కనిపిస్తే చాలు రెప్పపాటులో మాయం చేసి తినేస్తుంది. కోతులకు ఎక్కడా ఏం దొరకక చివరికి ఇలా షాప్స్ లోని కోడిగుడ్లను ఎత్తుకెళ్లి ఇలా తింటున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఆంజనేయుడి ప్రతిరూపంగా భావించే కోతులు ఇలా శాఖహారం నుండి మాంసహరిగా మారిపోవటం చూసి కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలికాలం అంటే ఇదేనేమోనంటూ వాపోతున్నారు. ఇప్పుడీవార్త సోషల్ మీడియాలో చేరి తెగ చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.