Viral Video: భూకంపం రాగానే భార్యను వదిలేసి బిడ్డను తీసుకుని పరిగెత్తారు… దీనిపై మీరేమంటారు ?..
ఓ వ్యక్తి తన కూతురితో పాటు ఇంట్లో కూర్చుని ఉన్నాడు. కాసేపటి తర్వాత అతను భూకంపం వస్తున్నట్లు గ్రహించి వెంటనే తన కూతురిని తీసుకుని బయటకు పరిగెత్తాడు.
ప్రకృతికి కోపం వస్తే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో తెలిసిందే. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం ఇలా పంచభూతాలు మనిషి మనుగడపై ప్రభావం చూపిస్తాయి. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంటాయి. ప్రమాదాల భారీ నుంచి తప్పించుకోవడానికి కొన్ని సంఘటనలను.. సూచనలను బట్టి తెలుసుకోవచ్చు. ఇటీవల ఓ వ్యక్తి భూకంపాన్ని ముందే పసిగట్టి తన కూతురిని రక్షించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో ఓ వ్యక్తి తన కూతురితో పాటు ఇంట్లో కూర్చుని ఉన్నాడు. కాసేపటి తర్వాత అతను భూకంపం వస్తున్నట్లు గ్రహించి వెంటనే తన కూతురిని తీసుకుని బయటకు పరిగెత్తాడు. ఆ తర్వాత కాసేపటి అతని భార్య కూడా బయటకు పరిగెత్తుతూ వచ్చేంది. వారంతా బయటకు వచ్చేసరికి ఇంట్లో ఉన్న వస్తువులన్ని కదులుతూ.. ఊగుతూ కింద పడిపోవడం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భూకంప ప్రకంపనలు రావడాన్ని ఆ వ్యక్తి ముందే గ్రహించాడు. వెంటనే అప్రమత్తమై తన కూతురిని.. కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన 2018లో అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో జరిగినట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.