Viral Video: మంత్రి సమక్షంలో వందేమాతర గీతానికి అవమానం.. ఫోన్ మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్
ఏదైనా కార్యక్రమం ప్రారంభించడానికి ముందు జాతీయగేయం వందేమాతరం ఆలపించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కడ ఉన్నవారు వందేమాతరం ఆలపించారు.
Viral Video: కాకినాడజిల్లాలో జాతీయ గేయాన్ని ఆలపిస్తున్న సమయంలో ఫోన్ మాట్లాడుతూ.. అవమానించారు జాయింట్ కలెక్టర్. రాష్ట్ర మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైన అధికారిక సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో వార్త సంచలనంగా మారింది. అంతేకాదు ప్రస్తుతం జాతీయ గేయాన్ని అవమానపరచిన వీడియో(Video) కూడా వైరల్ అవుతోంది. కాకినాడ జిల్లా…పెద్దాపురంలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం వేడుక జరిగింది. ఈ వేడుకలో మంత్రి ఆదిమూలపు సురేష్ ..మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ సహా ఇతరులు హాజరయ్యారు.
ఏదైనా కార్యక్రమం ప్రారంభించడానికి ముందు జాతీయగేయం వందేమాతరం ఆలపించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కడ ఉన్నవారు వందేమాతరం ఆలపించారు. అయితే సభలోని సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ తమ తమ స్థానాల్లో నిల్చొని వందేమాతర గీతం ఆలపిస్తున్నారు. ఓ వైపు అక్కడ ఉన్న మంత్రులు ఇతర సభ్యులు వందేమాతర గీతం ఆలపిస్తుంటే జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా ఫోన్ మాట్లాడుతున్నారు. జాయింట్ కలెక్టర్ స్థాయి లో ఉండి వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ఫోన్ మాట్లాడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరొకొందరు.. జాయింట్ కలెక్టర్ గా పదిమందికి చెప్పాల్సిన స్టేజ్ లో ఉన్న ఇలాక్కియా .. ఇలా వందేమాతర గేయాన్ని అవమానించినట్లు ప్రవర్తించడం సరికాదు అంటూ మండిపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..