Python Hulchul: కనిగిరిలో భారీ కొండచిలువ కలకలం.. నాలుగు కోళ్లను మింగి కదలలేని స్టేజ్‌లో ఫైథాన్

కనిగిరి రాజీవ్ కాలనిలో న ఓ ఇంట్లో అర్ధరాత్రి కొండచిలువ హల్ చల్ చేసింది. ఆ ఇంటి పెరడులో ఉన్న నాలుగు కోళ్లను మింగేసింది. బరువుతో కదలలేక.. అక్కడే చుట్టచుట్టుకుని ఉండిపోయింది

Python Hulchul: కనిగిరిలో భారీ కొండచిలువ కలకలం.. నాలుగు కోళ్లను మింగి కదలలేని స్టేజ్‌లో ఫైథాన్
Python Hulchul
Follow us
Surya Kala

|

Updated on: Jul 01, 2022 | 6:18 AM

Python Hulchul: ఆంధప్రదేశ్ లో జంతువులు , పాములు అడవులను వదిలి జనావాసాల బాట పడుతున్నాయి. ఇప్పటికే పులి, ఎలుగుబంటి పలు జిల్లాల్లో కలకలం సృష్టింస్తుండగా.. తాజాగా కొండచిలువ వంతు వచ్చింది. ప్రకాశం జిల్లా కనిగిరి లో కురిసిన చిన్న వర్షానికి.. కొండల్లో అడవుల్లో తిరగాల్సిన కొండచిలువ జనావాసాల మధ్య వచ్చింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.. వివరాల్లోకి వెళ్తే..

కొండ సమీపాన ఉన్న కనిగిరి రాజీవ్ కాలనిలో న ఓ ఇంట్లో అర్ధరాత్రి కొండచిలువ హల్ చల్ చేసింది. ఆ ఇంటి పెరడులో ఉన్న నాలుగు కోళ్లను మింగేసింది. బరువుతో కదలలేక.. అక్కడే చుట్టచుట్టుకుని ఉండిపోయింది. తెల్లవారిన తర్వాత ఇంటి యజమాని కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురై కేకలు వేసి ఇంటి చుట్టుపక్కల వారిని పిలిపించాడు. నాలుగు కోళ్లను మింగి అక్కడే  ఉన్నభారీ కొండ చిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుండి పరుగులు తీశారు. కొండచిలువ భారీగా ఉండటంతో ఏమీ చేయలేక పోయారు. అనంతరం ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీశాక అధికారులు ఆ కొండ చిలువను పట్టుకుని.. సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..