TSRTC: శ్రీవారికి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. ఇకపై దర్శనం మరింత సులువు.. నేటి నుంచే అమలు..

TS RTC: తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మంచి అవకాశాన్ని కల్పించింది. తిరుమలకు బస్‌ టికెట్ రిజర్వేషన్‌ చేసుకున్న సమయంలోనే దర్శనం టికెట్టును కూడా బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది...

TSRTC: శ్రీవారికి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. ఇకపై దర్శనం మరింత సులువు.. నేటి నుంచే అమలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 01, 2022 | 11:03 AM

TSRTC: తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మంచి అవకాశాన్ని కల్పించింది. తిరుమలకు బస్‌ టికెట్ రిజర్వేషన్‌ చేసుకున్న సమయంలోనే దర్శనం టికెట్టును కూడా బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ సేవలు నేటి నుంచి (శుక్రవారం) అమల్లోకి రానున్నాయి. తెలంగాణ నుంచి తిరుమలకు బస్సులో వెళ్లే భక్తులు ఇకపై ప్రత్యేకంగా దర్శనం టికెట్టును బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. దర్శన టికెట్లను బస్‌ టికెట్‌ చేసుకునే సమయంలోనే టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.

ఇందుకుగాను టీఎస్‌ఆర్టీసీ, టీటీడీల మధ్య ఒప్పందం కుదిరింది. తిరుమల వెళ్లే భక్తులు అ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. శుక్రవారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతీరోజూ 1000 దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా, ఏదైనా రిజర్వేషన్‌ కౌంటర్‌లో నేరుగా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే కనీసం వారం రోజుల ముందే టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..