Chiruta Tension: రాయచూరు జిల్లాలో చిరుత కలకలం.. భయాందోళనకు గురవుతున్న కోసిగి ప్రజలు
కర్ణాటకలోని రాయచూరు జిల్లా చిరుతపులి కలకలం సృష్టించింది. మరోవైపు మంత్రాలయం నియోజకవర్గం లోని కోసిగి కొండల్లో చిరుత పులి సంచరిస్తూ కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి
Chiruta Tension: ఆంధ్రప్రదేశ్ లో పులి, ఎలుగు బంట్లు, కొండచిలువలు, చిరుత పులి వంటి అడవి జంతువులు అడవులను వదిలి జనావాసాల బాట పట్టాయి. పలు జిల్లాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా కర్ణాటకలోని రాయచూరు జిల్లా చిరుతపులి కలకలం సృష్టించింది. జిల్లాలోని మాన్వి తాలుకా నీరుమాన్వి గ్రామ సమీప కొండల్లో చిరుత పులి కనిపించింది. చిరుత పులిని చూసిన కర్నాటక వాసులు తమ సెల్ ఫోన్లకు పని చెప్పి.. కెమెరలో బంధించారు. స్థానిక పొలాల్లో పని చేస్తున్న రైతులు, గొర్రెలు కాపరిలు చిరుత సంచారంతో భయాందోళన చెందుతున్నారు.
కర్నాటక అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత పులిని బంధించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చిరుత పులి వీడియోలు కాస్త వైరల్ అయింది. మరోవైపు మంత్రాలయం నియోజకవర్గం లోని కోసిగి కొండల్లో చిరుత పులి సంచరిస్తూ కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నిజం కాదని కోసిగి ప్రజలు అంటున్నారు. ఎవరు భయాందోళనకు గురి కాకుండా ఉండాలని కోరుతున్నారు. చిరుత పులి.. కర్ణాటక నీరుమాన్వి కొండల్లో మాత్రమే సంచరిస్తున్నట్లు.. కోసిగిలో చిరుత జాడ లేదని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..