Andhra Pradesh: పొలిటికల్ హీట్ పెంచిన వంగవీటి రాధ, నాదెండ్ల మనోహర్ భేటీ.. క్లారిటీ ఇచ్చిన నేతలు..

Vangaveeti Radha: వంగవీటి రాధ.. ఈ మధ్య కాలంలో రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న పర్సనాలిటీ. కానీ నాదెండ్ల భేటీతో మళ్లీ వార్తల్లోకెక్కారు. ఇంతకీ ఆయన జనసేనలో చేరబోతున్నారా? నాదెండ్ల భేటీ వెనుక అంతర్యమేంటి?

Andhra Pradesh: పొలిటికల్ హీట్ పెంచిన వంగవీటి రాధ, నాదెండ్ల మనోహర్ భేటీ.. క్లారిటీ ఇచ్చిన నేతలు..
Ap Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 02, 2022 | 8:24 AM

Vangaveeti Radha krishna – Nadendla Manohar : ఏపీలో వంగవీటి రాధ, నాదెండ్ల మనోహర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీళ్లిద్దరూ అరగంటకు పైగా భేటీ అయ్యారు. జనసేనలోకి వంగవీటి రాధ వస్తున్నాడని.. రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగింది. అయితే తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదనీ.. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని చెప్పారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. అటు వంగవీటి రాధ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాజకీయ పరిణామాలపై ఎటువంటి చర్చలు జరగలేదన్నారు. వంగవీటి ఆఫీసుకు సమీపంలోనే జనసేన త్వరలో సమావేశం నిర్వహించబోతోంది. ఈ ఏర్పాట్లు చూసేందుకు వచ్చిన నాదెండ్ల తమ ఇంటికి వచ్చారని రాధా అంటున్నారు.

కానీ వంగవీటి అభిమానులతో పాటు జనసైనికుల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా వంగవీటి రాధా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనను జనసేనలో చేర్చుకోవాలన్న అభిప్రాయంతో నాదెండ్ల మనోహర్ స్వయంగా వెళ్లి రాధాను కలిసినట్లు సమాచారం. ఆయన వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని జనసేన భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కలయిక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తి రేపింది. రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో.. వంగవీటి రాధాకృష్ణ జనసేనలోకి వెళ్తున్నారనే వార్తలు హల్ చల్ చేయడంతో ఇద్దరు నేతలు కూడా అదేం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ