Rain Alert: వానలే.. వానలు.. పొంగి పొర్లుతున్న వాగులు.. వంకలు.. ప్రాజెక్టుల వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది

Rain Alert: వర్షాలే వర్షాలు.. మామూలు వర్షాలు కావు. ఆకాశానికి చిల్లుపడినట్లు కురుస్తున్నాయి ఈ వానలు. వారం రోజుల నుంచి దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు..

Rain Alert: వానలే.. వానలు.. పొంగి పొర్లుతున్న వాగులు.. వంకలు.. ప్రాజెక్టుల వద్ద ప్రస్తుత పరిస్థితి ఇది
Follow us
Subhash Goud

|

Updated on: Jul 10, 2022 | 5:29 PM

Rain Alert: వర్షాలే వర్షాలు.. మామూలు వర్షాలు కావు. ఆకాశానికి చిల్లుపడినట్లు కురుస్తున్నాయి ఈ వానలు. వారం రోజుల నుంచి దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. అన్ని నదుల్లోకి వరదనీరు పోటెత్తడంతో.. ప్రాజెక్టులు కూడా క్రమంగా నిండుతున్నాయి. తెలంగాణలో గోదావరితోపాటు.. మిగిలిన చిన్న నదుల్లోనూ నీటి పొంగు కనిపిస్తోంది. భారీ వరదల కారణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రాత్రి, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్‌ వాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సీపీ ఆనంద్‌ సూచించారు. పోలీసులు హైదరాబాద్‌లోని రోడ్లపై ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

ముందు నిర్మల్‌ జిల్లాకి వెళదాం.. కడెం ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. 4 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 49వేల క్యూసెక్కులు ఉంటే.. ఔట్‌ఫ్లో 20వేల క్యూసెక్కులున్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుగా ఉంటే.. ఇప్పుడు నీటిమట్టం 692.1 అడుగులకు చేరింది. అటు గడ్డెన్న వాగు కూడా ఉగ్రరూపం దాల్చడంతో.. రిజర్వాయర్‌ గేట్లు ఎత్తారు.

ఇక హైదరాబాద్‌ చుట్టుపక్కల భారీగా కురిసిన వర్షాలకు జంట జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఉస్మాన్‌సాగర్‌కు వరద పోటు పెరిగింది. ఇన్‌ఫ్లో 100 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు ఉంటే.. ప్రస్తుత నీటిమట్టం 1785.80 అడుగులుగా ఉంది. ఇక హిమాయత్‌సాగర్‌ ప్రాజెక్టులోనూ భారీగా వరదనీరు చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులకు.. 1760.30 అడుగుల వరకు నీరు చేరింది.

ఇవి కూడా చదవండి

ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద భారీగా వస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు గేట్లను ఎత్తి నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 2200 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 4300 క్యూసెక్కులుగా ఉంది.

ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద నీరు..

కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. తెలంగాణ, ఏపీలో కురిసిన వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద పెరిగింది. దీంతో 30 గేట్ల ద్వారా నీటిని దిగువరకు వదులుతున్నారు. ముద్రంలోకి 18వేల250 క్యూసెక్కులు, కాలువల్లోకి 4వేల948 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇన్ ఫ్లో 23వేల198 క్యూసెక్కులుగా ఉంది.

తుంగభద్రలోనూ..

ఇక తుంగభద్రలోనూ వరద ప్రవాహం భారీగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 89వేల357 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 312 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 100.85 టీఎంసీలకు ప్రస్తుతం నీటినిల్వ 80 టీఎంసీలకు చేరింది.

శ్రీరాంసాగర్‌కు పోటెత్తుతున్న వరద నీరు..

ఇక గోదావరి నదికి పోటెత్తిన వరద విషయానికి వద్దాం. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కురిసిన వర్షానికి నదిలో భారీగా నీటి ప్రవాహం కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఇన్‌ఫ్లో 4లక్షల 83వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను.. ప్రస్తుతం 1084అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు ఔట్ ఫ్లో 10 వేల క్యూసెక్కులుగా ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు..

ఇక గోదావరి నదిపై ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రభావం తీవ్రంగా ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ ఇన్ ఫ్లో 8లక్షల 66వేల క్యూసెక్‌లు ఉండడంతో.. ప్రాజెక్టుకు ఉన్న 75 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి.. అదే స్థాయిలో నీటిని వదులుతున్నారు. బ్యారేజీ దిగువ ప్రాంతాల వారికి ప్రమాదం పొంచి ఉండడంతో.. అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.

భద్రాచలంలోనూ వరద ప్రభావం..

ఈ ప్రభావం అటు భద్రాచలంలోనూ కనిపిస్తోంది. ఇక్కడ గోదావరి నీటిమట్టం 32 అడుగులకు చేరింది. దాదాపు 5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదవుతోంది. రాత్రికి 43 అడుగులకు చేరుకోనుంది గోదావరి నీటిమట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 74 అడుగులకు..ప్రస్తుతం 70 అడుగులకు చేరింది.

ఏలూరు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు..

గోదావరికి వరద పోటు పెరుగుతుండడంతో.. ఏలూరు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే 48 గేట్లు ఎత్తారు అధికారులు. ప్రస్తుతం స్పిల్‌ వే దగ్గర 28 మీటర్ల నీటిమట్టం ఉంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీకి వరద పెరిగింది. దాదాపు లక్షా 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

కిన్నెరసాని ప్రాజెక్టు 4 గేట్ల ఎత్తివేత..

కిన్నెరసాని ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తేశారు. రాజాపురం దగ్గర వాగు ఉధృతి భారీగా ఉంది. 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జంపన్నవాగు పొంగింది. దీంతో రహదారులపైకి నీరు చేరుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!