AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వర్షాల నేపథ్యంలో కలెక్టర్లను అలర్ట్ చేసిన సీఎస్.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం..

Telangana: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేశారు సీఎస్ సోమేశ్ కుమార్.

Telangana: వర్షాల నేపథ్యంలో కలెక్టర్లను అలర్ట్ చేసిన సీఎస్.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం..
Cs Somesh Kumar
Shiva Prajapati
|

Updated on: Jul 10, 2022 | 4:47 PM

Share

Telangana: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేశారు సీఎస్ సోమేశ్ కుమార్. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అదేవిధంగా ప్రతీ జిల్లా కలెక్టరేట్‌లలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యంగా ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇప్పటికే నిండిన అన్ని చెరువులు, కుంటల వద్ద ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.

ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే వెంటనే పునరుద్దరించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు తలెత్తలేదని అన్నారు. గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులను పరిశుభ్రం చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తగు రసాయన పదార్థాలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమీషనర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో..
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు..
నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!
నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!
రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం!
రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం!