Antarvedi: ఎండకు ఎండి, వానకు తడుస్తున్న అంతర్వేదిలోని కొత్త రథం.. కనీసం రేకుల షెడ్డునైనా నిర్మించమని కోరుతున్న ధార్మిక సంఘాలు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఊరేగింపు రథం ఇప్పుడు ఎండకు ఎండి వానకు తడుస్తోంది. అయినప్పటికీ ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. కొత్త రథం పాడవుతున్న ఎండోమెంట్ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు
Antarvedi: కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది. వశిష్ట గోదావరి నది.. బంగాళాఖాతంలో సంగమించే ప్రాంతం.. అంతర్వేది. ఇక్కడ శ్రీలక్మినరసింహం స్వామి కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు. అతిప్రాచీనమైన క్షేత్రం.. పురాణాల్లో ప్రస్తావన ఉంది. నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువు తీరి కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పూజలను అందుకుంటున్నాడు. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం దక్షిణ కాశిగా పేరుగాంచింది. భీష్మ ఏకాదశి పర్వదినాన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. తీర్ధం కూడా ఉభయగోదావరి జిల్లాలో ఫేమస్. లక్ష్మీనరసింహ స్వామి ఊరేగింపుకు ఉపయోగించే రధం.. ఇక్కడ జరిగే రథయాత్రను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
సుమారు 62ఏళ్ల చరిత్ర ఉన్న రథం దగ్ధం అయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రథాన్ని నిర్మించింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఊరేగింపు రథం ఇప్పుడు ఎండకు ఎండి వానకు తడుస్తోంది. అయినప్పటికీ ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. కొత్త రథం పాడవుతున్న ఎండోమెంట్ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. రథాన్ని సురక్షితంగా పెట్టడానికి ఓ రేకుల షెడ్డుని కూడా ఆలయ అధికారులు నిర్మించడం లేదు. పాత రథం మంటల్లో కాలినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు కోటి రూపాయలు వెచ్చించి బర్మా టేకుతో నిర్మించింది. ఇప్పుడు ఈ రథం వర్షానికి తడవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న హిందూ ధర్మిక సంఘాలు. అంతర్వేది శ్రీ లక్ష్మీనరశింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని రథం దగ్ధం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొత్త రథ నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణం 90 లక్షలు మంజూరు చేసింది. కొత్త రథం నిర్మాణ వ్యయం పెరగడంతో కోటి 10 లక్షలు వెచ్చించింది. 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని గత ఏడాది ఫిబ్రవరి 19 న సీఎం జగన్ ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..