AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జాపై పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు.. తోసి పుచ్చిన ఏపీ ప్రభుత్వం

Fact Check: ఆదివారం రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కల్యాణ్.. ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏళ్ల తరబడి..

Fact Check: వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జాపై పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు.. తోసి పుచ్చిన ఏపీ ప్రభుత్వం
Subhash Goud
|

Updated on: Jul 11, 2022 | 12:42 PM

Share

Fact Check: ఆదివారం రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కల్యాణ్.. ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏళ్ల తరబడి పలు సమస్యలు ఎదుర్కొంటున్న వారు పవన్‌కు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. వైసీపీ నేతలు సామాన్య ప్రజలను బతకనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు.  వైసీపీ నేతలు అమాయకుల ఇళ్ల స్థలాలు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. అయితే రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జాపై పవన్‌ కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం తోసిపుచ్చి ట్విట్టర్‌ ద్వారా వివరణ ఇస్తూ అందుకు సంబంధిన ఓ నోటిసును ట్విట్టర్ లో పోస్టు చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం ఫ్యాక్‌ చెక్‌ ద్వారా పూర్తి వివరాలను అందించింది. 2004లో ప్లాట్‌నెంబర్‌ 2400లో తిరుపతి అర్బన్‌ మండలానికి చెందిన అర్హులైన లబ్దిదారులకు 6700 ఇళ్ల స్థలాలను మంజూరు చేసినట్లు తెలిపింది. అలాగే 2018లో మంజూరైన వాటిలో 989 స్థలాలను అప్పటి తహసీల్దార్‌ రద్దు చేశారని, అందులో పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేసిన ప్లాట్‌ నెంబర్‌ 2400లోని స్థలం కూడా ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఎలాంటి భూ కబ్జా జరగలేదని ట్విట్టర్‌లో ఫ్యాక్‌చెక్‌ ద్వారా వివరణ ఇచ్చుకుంది ప్రభుత్వం. ఈ మేరకు జనసేన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో భూకబ్జాపై చేసిన పోస్టును సైతం ప్రభుత్వం అటాచ్‌ చేస్తూ ఈ ట్వీట్‌ చేసింది.

ఈ కబ్జా ఘటనపై వాస్తవాలను వెల్లడించిన కలెక్టర్‌

అయితే ‘జనవాణి’ పేరిట వైఎస్‌ జగన్‌ సర్కారుపై పవన్‌ కళ్యాణ్‌ విషవాణి ప్రచారం చేస్తున్నట్లు వైసీపీ ఆరోపించింది. అసత్యాలు, అబద్ధాలు, అవాస్తవాలు, కట్టుకథలతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళతో పవన్‌ కల్యాణ్‌ ఒక హైడ్రామా సృష్టించినట్లు ఆరోపించింది. నిరాధార ఆరోపణలు పట్టుకుని ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు, అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించింది. అయితే ఈ ఘటనలపై పూర్తి వివరాలను తిరుపతి జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదించారు.

అసలు వివాదం ఎక్కడొచ్చింది..

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామం, తారకరామనగర్‌లో ప్లాటు నంబరు 2400 వెనుక ఉన్న వాస్తవాలను కలెక్టర్‌ వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. 2004లో అనిత అనే మహిళకు ఇంటిపట్టాను ప్రభుత్వం కేటాయించింది. 6 నుంచి 12 నెలల్లోగా ఇల్లుగాని, గుడిసెగాని వేసుకుని స్వాధీనంలో ఉంచుకోవాలని షరతు విధించింది. 2018 చంద్రబాబు హయాంలో అదే ప్రాంతంలోని 989 ప్లాట్లలో లబ్ధిదారులు 2004 నుంచి ఎలాంటి గుడిసెకానీ, ఇల్లు కానీ కట్టుకుని పొసెషన్‌లోకి రాకపోవడంపై వారందరికీ నోటీసులు జారీ చేశారు అధికారులు. లబ్ధిదారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్లాట్లను రద్దుచేస్తూ ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం. ప్లాటు నంబరు 2400ను వి. వెంకటేష్‌ అనే వ్యక్తికి కేటాయిస్తూ ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు చంద్రబాబు హయాంలోని తహశీల్దార్‌. అదేసమయంలో 3వేల మందికి ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్ల జారీ చేశారు. ఒకేసారి అంతపెద్ద మొత్తంలో ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్లు జారీ చేయడంపై చిత్తూరు కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈలోగా ఆ ప్లాటులో వెంకటేష్‌ షెడ్డును నిర్మించిన ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ పొందారు.

ఇంటి మీద ఇంటి పన్ను, కరెంటు బిల్లు కూడా చెల్లిస్తున్నారు. షెడ్డు నిర్మిస్తున్న సమయంలో అనిత, వెంకటేష్‌ల మధ్య వివాదం తలెత్తింది. అనిత షెడ్డును ఆక్రమించుకోవడంతో అనితపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంకటేష్‌. ఆ తర్వాత వెంకటేష్‌ అనిత నుంచి షెడ్డును స్వాధీనంచేసుకున్నారు. వెంటనే వెంకటేష్‌ దాని చుట్టూ ప్రహరీగోడను కూడా నిర్మించుకున్నారు. వెంకటేష్‌ బీసీ వర్గానికి చెందిన బోయ కులానికి చెందిన వ్యక్తి. అతను దొడ్లమిట్టలో ఒక కూల్‌డ్రింకు షాపులో కూలీగా పని చేస్తున్నాడు. వైయస్సార్‌సీపీతో వెంకటేష్‌కు ఎలాంటి సంబంధంలేదంటూ అధికారులు తెలిపారు.

వాస్తవాలను మరుగున పరిచి..

ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వివాదానికి పవన్‌ కల్యాణ్‌ మసిపూసి మారేడు కాయ చేసినట్లు నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడ జనవాణి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఈ అంశాన్ని వీడియో తీసి అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి.. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విష ప్రయత్నం చేస్తున్నట్లు వైసీపీ నపేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి