AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP MP Lakshman: కేసీఆర్‌ పతనానికి రోజులు దగ్గర పడ్డాయి.. విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

BJP MP Lakshman: ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం ముగించుకుని తొలిసారి తెలంగాణకు చేరుకున్న బిజెపి సీనియర్ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్‌కు..

BJP MP Lakshman: కేసీఆర్‌ పతనానికి రోజులు దగ్గర పడ్డాయి.. విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌
Bjp Mp Lakshman
Subhash Goud
|

Updated on: Jul 11, 2022 | 9:12 AM

Share

BJP MP Lakshman: ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం ముగించుకుని తొలిసారి తెలంగాణకు చేరుకున్న బిజెపి సీనియర్ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్‌కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అయనకు ఘణంగా స్వాధీనం పలికారు పార్టీ కార్యకర్తలు నాయకులు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీ ప్రభుత్వంపై నీ విధానాలపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పో మేము సిద్దంగా ఉన్నామని కేసిఆర్‌కు సవాల్ విసిరారు. ఎప్పుడు ఈ పీడను వదులుకుందామా, ఈ అవినీతి ప్రభుత్వాని తరిమి కొడదమా అని ప్రజలు కళ్లకు వత్తులు పెట్టుకు ఎదురుచుస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షను, అశలను మేము నేరవేరుస్తామని తెలిపారు.

బీజేపీ కార్యవర్గ సమావేశాలు పూర్తి అయిన పది రోజులకు కేసీఆర్ నిద్రమత్తులో నుండి మేలుకుని ప్రధానమంత్రి పై విమర్శలు చేయడంతోపాటు నాపై వ్యక్తిగత విమర్శలు చేయడమంటే వారు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైనప్పటికి తెలంగాణ ప్రజల సమస్యల పట్ల, తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న అవినీతి, కుటుంబ పాలన పట్ల రాజ్యసభ సభను వేదిక చేసుకుని ప్రశ్నించే వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు భరోసా కలిగించే రీతిలో కొనసాగుతానని అన్నారు. కేసీఆర్‌ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై స్పందించారు.

80వేలకు పైగా పుస్తకాలు చదివానని చెప్పుకునే నీవు ఓ రాజకీయ అజ్ఞానిగా వ్యవహరిస్తున్నావు. తెలంగాణ బిడ్డను ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రానికి రాజ్యసభకు పంపిన మా నాయకుడు నరేంద్ర మోడీని చూసి ఓర్వలేక అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నవో తెలంగాణ ప్రజానీకం గమనిస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పతనానికి చేరువలో పార్టీ కొట్టుమిట్టాడుతుందన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనట్లు కేసిఆర్ మాట్లాడుతున్నాన్నాడని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి