AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuntala: కుంటాల జలపాతానికి పోటెత్తిన వరద.. ఉగ్రరూపం దాల్చిన జలపాతం.. పర్యాటకులకు నో ఎంట్రీ..

Kuntala WaterFalls: పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే కుంటాల జలపాతం డేంజర్‌గా మారింది. మహోగ్రరూపం దాల్చిన జలపాతం వైపు ఎవరూ..

Kuntala: కుంటాల జలపాతానికి పోటెత్తిన వరద.. ఉగ్రరూపం దాల్చిన జలపాతం.. పర్యాటకులకు నో ఎంట్రీ..
Kuntala
Shiva Prajapati
|

Updated on: Jul 11, 2022 | 9:41 AM

Share

Kuntala WaterFalls: పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే కుంటాల జలపాతం డేంజర్‌గా మారింది. మహోగ్రరూపం దాల్చిన జలపాతం వైపు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు పోలీసులు. తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. వరద నీరు ముంచెత్తడంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ఇన్‌ఫ్లోతో పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారగా, వాగులు వంకలు డేంజర్‌గా మారాయ్‌. ఉధృతంగా ప్రవహిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయ్‌. మరోవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో కుంటాల జలపాతానికి వరద నీరు పోటెత్తుతోంది. కుంటాల జలహోరు కిలోమీటర్ వరకు వినిపిస్తూ భయపెడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుంటాల జలపాతం ఉగ్రూపం దాల్చింది.

ప్రముఖ పర్యాటక కేంద్రాలైన జలపాతాలకు వరద నీరు పోటెత్తడంతో ముందుజాగ్రత్తలు చేపట్టారు పోలీసులు. కుంటాల జలపాతం వైపు పర్యాటకులు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కుంటాల వాటర్‌ఫాల్స్‌ వైపు నో ఎంట్రీ బోర్డులు పెట్టారు. జలహోరుతో సందడి చేస్తోన్న కుంటాల జలపాతాన్ని చూసేందుకు తరలివస్తున్న ప్రజలను రోడ్డుపైనే ఆపేస్తున్నారు పోలీసులు. ప్రమాదకరంగా మారిన జలపాతం వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. కుంటాల మెయిన్‌ గేట్‌ దగ్గరే పర్యాటకులను నిలిపివేసి వెనక్కి పంపుతున్నారు అటవీ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..