AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diet Plan: మగవాళ్లు.. మీ వయస్సు 40కి చేరువవుతోందా? అయితే, మీ కోసమే హెల్తీ డైట్‌ ప్లాన్‌.. ఎప్పటికీ యంగ్ హీరోల్లా ఉంటారు

40 ఏళ్లు దాటిన తర్వాత.. ముఖ్యంగా పురుషులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఆహారంపై శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ముందు ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి.

Diet Plan: మగవాళ్లు.. మీ వయస్సు 40కి చేరువవుతోందా? అయితే, మీ కోసమే హెల్తీ డైట్‌ ప్లాన్‌.. ఎప్పటికీ యంగ్ హీరోల్లా ఉంటారు
Diet Plan
Jyothi Gadda
|

Updated on: Jul 11, 2022 | 12:31 PM

Share

Diet Plan:  సాధారణంగా ఎవరైనా సరే పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎక్కువగా డైట్ లో పండ్లు, కూరగాయలు, లోఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ వంటివి తీసుకుంటూ ఉండాలి. ప్రతిఒక్కరికీ వయసు పెరిగేకొద్దీ బాధ్యతలు మీద పడుతుంటాయి. ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. ముఖ్యంగా 40 దాటిన తర్వాత ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యల బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి 40 ఏళ్లు దాటిన తర్వాత.. ముఖ్యంగా పురుషులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఆహారంపై శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ముందు ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. ఫెర్టిలిటీ సమస్యలు నీరసం మొదలైన సమస్యలు రాకుండా ఉండాలంటే ఇవి బాగా ఉపయోగపడతాయి. అందుకే మగవారి ఆరోగ్యం కోసం చక్కటి డైట్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మగవారు తరచూ ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తద్వారా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. బీన్స్, బెర్రీలు,అవకాడో, పాప్ కార్న్, డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, బ్రకోలీ, పొటాటో,నట్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. తృణధాన్యాల్లో ఫైబర్‌తో పాటు వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్, రెడ్ రైస్ రూపంలో తృణ ధాన్యాలను తీసుకోవచ్చు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రోటీన్ డైట్‌లో పాలు, గుడ్లు, చికెన్ చేర్చుకోవచ్చు.

రోజూ వారీ ఆహారంలో మంచి కొలెస్ట్రాల్ ఉండేలా చూసుకోవాలి. అలాంటి ఫుడ్స్‌ని చేర్చుకోవాలి. ఫ్లాక్స్, ఫ్యాటీ ఫిష్, చియా సీడ్స్, సోయా ప్రొడక్స్ట్, వెజిటేబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి ఫుడ్స్ ద్వారా శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ అందుతుంది. గుడ్ కొలెస్ట్రాల్‌నే హైడెన్సిటీ లిపో ప్రోటీన్ అని పిలుస్తారు. గుడ్ కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల బారినపడే రిస్క్ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఫ్రూట్స్‌ని కూడా మగవారు తమ డైట్‌లో చేర్చుకోవటం చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే నీరసం తగ్గుతుంది. అలాగే కివి ఫ్రూట్‌కూడా మంచిది. విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలానే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి కూడా పురుషులకి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దానిని కూడా డైట్ లో తీసుకోండి. అరటి పండ్లు మనకు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. సెక్సువల్ పవర్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. అలానే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి