Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూకే నుంచి 6,500 కిలోమీటర్లు నడిచి మక్కా చేరుకున్న భక్తుడు.. తన లక్షం ఒకటేనంటున్నాడు..!

మక్కా చేరుకునేందుకు అతడికి మొత్తంగా 10 నెలల 25 రోజులు పట్టింది. ప్రతి రోజూ సగటున 17.8 కిలోమీటర్లు ప్రయాణించాడు. ప్రయాణం పొడవునా అతడు..ఇస్లామిక్ పారాయణాలు పఠించాడు. ప్రయాణంలో అవసరమయ్యే వస్తువులను..

యూకే నుంచి 6,500 కిలోమీటర్లు నడిచి మక్కా చేరుకున్న భక్తుడు.. తన లక్షం ఒకటేనంటున్నాడు..!
British Pilgrim
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 11, 2022 | 1:29 PM

British pilgrim: అయ్యప్ప స్వాములు తరచూ కాలినడక శబరి ప్రయాణం చేస్తుంటారు. తిరుమల వెంకన్న భక్తులు కొండకు నడిచి వస్తామని మొక్కుకుంటారు. అయితే, ఇక్కడ ఒక ముస్లిం ఇలాంటి మొక్కునే నెరవేర్చుకున్నాడు. అయితే, అతడు మన దేశస్థుడు కాదు..బ్రిటన్‌కు చెందిన అడం మొహమ్మద్ తన దేశం నుంచి మక్కా వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాడు. 6500 కిలోమీటర్ల దూరాన్ని 10 నెలల 25 రోజులలో చేరుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

52 ఏండ్ల ఆడం మొహమ్మద్ హజ్ యాత్రలో భాగంగా మక్కా చేరుకోవాలనుకున్నాడు. ఇంగ్లండ్‌లోని వాల్వర్‌హాంప్టన్‌లో అతను గతేడాది ఆగస్టు 1న పాదయాత్ర మొదలుపెట్టాడు. అలా 6,500 కిలోమీటర్లు నడిచి మక్కాను చేరుకున్నాడు.  అతడి ప్రయాణంలో భాగంగా  నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్, జోర్డాన్‌ల మీదుగా నడిచాడు. మక్కా చేరుకునేందుకు అతడికి మొత్తంగా 10 నెలల 25 రోజులు పట్టింది. ప్రతి రోజూ సగటున 17.8 కిలోమీటర్లు ప్రయాణించాడు. ప్రయాణం పొడవునా అతడు..ఇస్లామిక్ పారాయణాలు పఠించాడు. ప్రయాణంలో అవసరమయ్యే వస్తువులను మోసుకెళ్లేందుకు ఇంట్లో సొంతంగా ఓ బండిని తయారుచేసుకున్నాడు. దాని బరువు 300 కేజీలు. దానికి స్పీకర్లు కూడా అమర్చుకున్నాడు. ఇక  అక్కడికి చేరుకున్న తర్వాత మంత్రి మాజిద్ బిన్ అబ్దుల్లా అల్ కసాబి ఆడంకి ఆతిథ్యం ఇచ్చి హజ్ పర్మిట్‌ను ఇప్పించారు.

ఈ సందర్భంగా ఆడమ్ మాట్లాడుతూ..‘నేను ఈ పని కీర్తి కోసమో, డబ్బు కోసమో చేయలేదు. జాతి, మతం, రంగు వంటి భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటేనని ప్రపంచానికి చాటడానికి యాత్ర చేశాను. ఇస్లాం బోధించే శాంతి, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడమే నా పర్యటన లక్ష్యం’ అని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి