భానుడి ఉగ్రరూపం.. ఎండవేడికి ఏకంగా రైలు పట్టాలే కాలిపోయిన షాకింగ్ ఘటన.. ఎక్కడంటే..
కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రాల్లో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. కానీ, అక్కడ మాత్రం భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భానుడి భగభగలకు.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయిన ఘటన చోటు చేసుకుంది.
London Train Tracks Burst : మన దేశమంతటా వర్షాకాలం మొదలైంది. వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేని వర్షాలతో పల్లెలు, పట్టణాలు, నగరాలు తడిసి ముద్దవుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రాల్లో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. కానీ, అక్కడ మాత్రం భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భానుడి భగభగలకు.. ఏకంగా రైలు పట్టాలే కాలిపోయిన ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. అవును మీరు విన్నది నిజమే ఎండల ధాటికి రైలు పట్టాలపై అగ్గిరాజుకుంది. వాండ్స్‌వార్త్ రోడ్, లండన్ విక్టోరియా మధ్య సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలు పట్టాలు కాలిపోయిన విషయాన్ని సౌత్‌ఈస్ట్రన్ రైల్వే ఎండీ స్టీవ్ వైట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. అయితే సకాలంలో సిబ్బంది స్పందించి మంటలను ఆర్పేసినట్లు ఆయన వెల్లడించారు.
Thank you to @NetworkRailSE and the London Fire Brigade for responding promptly to a lineside fire this morning and allowing services to safely resume to Victoria ? pic.twitter.com/9ZYibliuyF
— Steve White (@SteveWhiteRail) July 11, 2022
ఇక స్టీవ్‌ట్వీట్‌కు.. సిబ్బంది కూడా స్పందించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు సవాల్‌గా మారనున్నాయని తెలిపారు. పట్టాలపై మరీ పొడి వాతావరణం ఉండడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. యూకేలో 34 డిగ్రీల సెల్సియస్ దాటితే.. ఇలాంటి పరిస్థితులు నెలకొనడం గమనార్హం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి