Srilanka Crisis: శృతిమించుతున్న శ్రీలంక ఆందోళనలు.. భారత్ బలగాలపై క్లారిటీ..!
Srilanka Crisis: శ్రీలంకంలో ఆందోళనలు శృతిమించాయి. అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిందే.. కొత్త ప్రభుత్వం రావాల్సిందే అనే నినాదం తాజాగా తెరపైకి వచ్చింది. ఈనెల 15న పార్లమెంట్..
Srilanka Crisis: శ్రీలంకంలో ఆందోళనలు శృతిమించాయి. అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిందే.. కొత్త ప్రభుత్వం రావాల్సిందే అనే నినాదం తాజాగా తెరపైకి వచ్చింది. ఈనెల 15న పార్లమెంట్ సమావేశాల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై క్లారిటీరానుంది. ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక కొట్టిమిట్టాడుతుంది. ఇప్పటికే అక్కడ లాఅండ్ అర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. సంక్షోభ కార్చిచ్చు నిరసన కారులను మరింత రెచ్చగొట్టడంతో ఆందోళనలు శృతిమించాయి. ఏకంగా అధ్యక్ష, ప్రధాని అధికారిక నివాసాల్లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. మూడు రోజుల నుంచి అక్కడే మకాం వేశారు. బెడ్ రూమ్ లు, స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్ సెంటర్లలో రచ్చరచ్చ చేస్తున్నారు. అధ్యక్ష భవనంలో అందినకాడికి దోచుకుంటున్నారు ఆందోళనకారులు. కోటి రూపాయలకు పైగా విలువ చేసే నోట్ల కట్టలను ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ నెల 13న అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేస్తారనీ.. ఆ తర్వాత అన్ని పార్టీల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్పీకర్ చెప్పారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈనెల 18న నామినేషన్లు స్వీకరిస్తామని 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని చెప్పారు. ఇవ్వన్ని ఈనెల 15న జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తున్నట్లు చెప్పారు స్పీకర్. నిరసన కారుల ఆందోళనలకు భయపడిన అధ్యక్షుడు రాజపక్స.. దేశం విడిచి దుబాయ్ వెళ్లారనే వార్తను శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ ఖండించారు. రాజపక్స ఇప్పటికీ దేశంలోనే ఉన్నారనీ.. శ్రీలంక నేవీ సంరక్షణలో గోటబయ రాజపక్స ఉన్నట్లు చెప్తున్నారు. ఈనెల 13న రాజీనామా చేస్తారని ప్రధాని కార్యాలయం కూడా స్పష్టం చేసింది. మరోవైపు శ్రీలంకకు భారత్ నుంచి బలగాలు వెళ్తున్నాయనే వార్తలను రాయబార కార్యాలయం తప్పుబట్టింది. సంక్షోభం సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని చెప్పింది. కానీ ఆ దేశంలో కొనసాగుతోన్న నిరసనలను కట్టడిచేసేందుకు భారత్ బలగాలను పంపడం లేదని క్లారిటీ ఇచ్చింది.
కాగా, విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ఆ దేశ అవసరాలకు సరిపడే ఇంధనాన్ని కూడా అక్కడి సర్కార్ కొనుగోలు చేయలేకపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొన్ని రంగాలకు అస్సలు ఇంధనాన్ని కేటాయించడం లేదు. ఈ ఇంధన సంక్షభ ప్రభావం ముఖ్యంగా విద్యా వ్యవస్థపై పడింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి