Pakistan: మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు దారుణంగా తయారైన పాకిస్తాన్ పరిస్థితి

Pakistan Floods: అసలే ఆర్థిక సంక్షోభం.. ఆపై వానలు. పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. దాయాది దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. కరాచీ నగరం జలదిగ్భందంలో చిక్కుకుంది...

Pakistan: మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు దారుణంగా తయారైన పాకిస్తాన్ పరిస్థితి
Pakistan Floods
Follow us
Subhash Goud

|

Updated on: Jul 12, 2022 | 10:12 AM

Pakistan Floods: అసలే ఆర్థిక సంక్షోభం.. ఆపై వానలు. పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. దాయాది దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. కరాచీ నగరం జలదిగ్భందంలో చిక్కుకుంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లైంది పాకిస్థాన్ పరిస్థితి. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న పాక్ ను భారీ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దాయాది దేశం పాకిస్థాన్‌లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. దేశంలోనే అతిపెద్ద నగరమైన కరాచీలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వీధులు జలమయం అయ్యాయి. కరాచీ సిటీ జలదిగ్భంధంలో చిక్కుకుంది. కరాచీ ఎయిర్‌పోర్టులోని రన్‌వేలో మోకాల్లోతు వరకు వరద నీరు చేరుకుంది. దాంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంలో చిక్కుకున్నాయి.

పాకిస్తాన్ లో  కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బలూచిస్థాన్‌లోని దక్షిణ ప్రావిన్స్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు మహిళలు, పిల్లలు మృతి చెందుతున్నారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. బలూచిస్థాన్‌లో వర్షాల వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. దక్షిణ ప్రావిన్స్‌లో వరద దాటికి ఎనిమిది ఆనకట్టలు తెగిపోయాయి. వరదలతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 57 మంది చనిపోయినట్లు చెప్పారు ప్రావిన్స్ సీఎం విపత్తు, హోం వ్యవహారాల సలహాదారు జియావుల్లా లాంగోవ్. బలూచిస్తాన్ నగరంలోని రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటితో రోడ్లు, అండర్‌పాస్‌లను కూడా మూసివేశారు. పలుచోట్ల భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. నలుగురు గాయపడినట్లు జిల్లా అధికారి చెప్పారు. 2010 తర్వాత పాకిస్తాన్ లో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. దారుణమైన వరదలు తలెత్తాయి. దీంతో 20 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పెద్ద మొత్తంలో పంటలు నాశనమయ్యాయి. వరదలతో పాకిస్థాన్ దాదాపుగా అతలాకుతలం అయింది. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న పాకిస్తాన్ ను వరదలు తీవ్ర ఇబ్బంది పెట్టాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి