PM Modi: నేడు ప్రధాని మోడీ పర్యటన.. ఆ రాష్ట్రంలో అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభోత్సవం

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు బీహార్-జార్ఖండ్ పర్యటించనున్నారు. ముందుగా మోదీ జార్ఖండ్‌లోని డియోఘర్ చేరుకుంటారు. ఇక్కడ బాబా బైద్యనాథ్ ఆలయంలో దర్శనం..

PM Modi: నేడు ప్రధాని మోడీ పర్యటన.. ఆ రాష్ట్రంలో అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభోత్సవం
Pm Modi
Follow us

|

Updated on: Jul 12, 2022 | 9:00 AM

PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు బీహార్-జార్ఖండ్ పర్యటించనున్నారు. ముందుగా మోదీ జార్ఖండ్‌లోని డియోఘర్ చేరుకుంటారు. ఇక్కడ బాబా బైద్యనాథ్ ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం దియోఘర్ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అలాగే జార్ఖండ్ ప్రజలకు 16 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ బహుమతిగా ఇవ్వనున్నారు. ఇక్కడి నుంచి ఆయన బీహార్ చేరుకుంటారు. బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. దీని ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

డియోఘర్‌లో 16 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. బాబా బైద్యనాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాలు దేశవ్యాప్తంగా భక్తులకు ఇది ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. శ్రవణమాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆలయం దర్శనం అనంతరం మోడీ డియోఘర్ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో ప్రధాని కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో..

ఇవి కూడా చదవండి

నేడు బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మోడీ జార్ఖండ్‌ నుంచి నేరుగా బీహార్‌ రాజధాని పాట్నాకు చేరుకుంటారు. ఇక్కడ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. బీహార్ శాసనసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మించిన శతాబ్ది స్మారక స్థూపాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా పాట్నా విమానాశ్రయంలో జరుగుతున్న నిర్మాణ పనులను నిలిపివేశామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రెండు గంటలకు బదులు తమ విమానాలు బయలుదేరడానికి మూడు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రయాణికులను విమానయాన సంస్థలు కోరాయి. ప్రధాని మోదీ విమానం సాయంత్రం 5.20 గంటలకు పాట్నా ఎయిర్‌పోర్టులో దిగనుంది.

బెదిరింపు పోస్టులు పెట్టిన ఇద్దరిని అరెస్టు చేశారు

సోషల్ మీడియాలో ప్రధాని మోదీని ఉద్దేశించి బెదిరింపు సందేశాలు పోస్ట్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను శనివారం సమస్తిపూర్ జిల్లాలోని షాపూర్ పటోరిలో అరెస్టు చేశారు. వారిని సజ్జన్ కుమార్, రుడాల్ కుమార్‌లుగా గుర్తించారు. రుడాల్ SBI ATM కియోస్క్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

డియోఘర్‌లో 16 వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులు:

☛ డియోఘర్ విమానాశ్రయం

☛ డియోఘర్ ఎయిమ్స్‌లో 250 పడకల ఆసుపత్రి, అకడమిక్ భవనం

☛ దియోఘర్ నుండి వారణాసికి గతిమాన్ ఎక్స్‌ప్రెస్. ఈ కొత్త రైలు ద్వారా ఏడు గంటల్లో ప్రయాణం పూర్తవుతుంది

☛ సంతాల్ పరగణాల ఐదు జిల్లాలతో సహా బీహార్‌లోని బంకా కోసం గ్యాస్ పైప్‌లైన్ పథకం

☛ డియోఘర్‌లో గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్

☛ జసిదిహ్ రైలు బైపాస్

☛ గాంధీనగర్, బనారస్ తరహాలో జసిదిహ్ జంక్షన్‌ను ప్రపంచ స్థాయి స్టేషన్‌గా మార్చడానికి ప్లాన్

☛హన్సికా -మహాగామ నాలుగు లేన్ల రహదారి (955 కోట్లు)

☛ గొడ్డ స్టేషన్‌లో కోచింగ్ యార్డ్

☛ మధుపూర్ స్టేషన్‌లో వాషింగ్ పిట్