CI Nageswara Rao Case: కలకలం రేపుతున్న సీఐ నాగేశ్వర్‌రావు కేసు.. తవ్వేకొద్ది బయటకొస్తున్న అక్రమాలు!
CI Nageswara Rao Case: సీఐ నాగేశ్వర్‌రావు ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. రేప్ కేస్‌తోపాటు అక్రమాలు, సెటిల్మెంట్లు, బెదిరింపుల బాగోతాలు బయటపడ్తున్నాయ్. ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు.
CI Nageswara Rao Case: సీఐ నాగేశ్వర్‌రావు ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. రేప్ కేస్‌తోపాటు అక్రమాలు, సెటిల్మెంట్లు, బెదిరింపుల బాగోతాలు బయటపడ్తున్నాయ్. ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు బాధితులు. రేప్ కేసులో లొంగిపోయిన సీఐ నాగేశ్వర్‌రావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో పోలీసు ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారు. బాధితులంతా ఒక్కొక్కరిగా బయటికి వస్తుండటంతో సీక్రెట్‌గా ఎంక్వైరీ చేస్తున్నారు ఎస్‌వోటీ పోలీసులు. మెయిన్‌గా రేప్ కేసులో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. గన్‌తో బెదిరించి అత్యాచారం చేసినట్లు వివాహిత ఫిర్యాదు ఇవ్వడంతో కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అలాగే, సీఐ నాగేశ్వర్‌రావు నుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు ఎస్వోటీ పోలీసులు. అత్యాచారం జరిగిందన్న ప్లేస్ నుంచి యాక్సిడెంట్ జరిగిన ఇబ్రహీంపట్నం స్పాట్ వరకు కీలక ఆధారాలు సేకరించారు.
బాధితురాలికి మెడికల్ టెస్టులను పూర్తి చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్‌లతోపాటు ఐ విట్నెస్ స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు పోలీసులు. ఇక రేప్ కేస్‌తోపాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సీఐ నాగేశ్వర్‌రావు. బాధితులంతా ఒక్కొక్కరిగా బయటికి వస్తుండటంతో గోప్యంగా ఇంటరాగేట్ చేస్తున్నారు పోలీసులు. పెద్దఅంబర్‌పేట ఎస్‌వోటీ పోలీసుల ఎదుట లొంగిపోయిన సీఐ నాగేశ్వర్‌రావును వైద్యపరీక్షలు చేయించారు. సీఐ నాగేశ్వర్‌రావుపై రేప్ కేస్‌తోపాటు కిడ్నాప్, ఎటాక్, యాక్సిడెంట్, ఆయుధాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. పోలీస్‌శాఖ సైతం ఉలిక్కిపడింది. మహిళలకు భద్రత కల్పించాల్సిన స్టేషన్ ఆఫీసరే, అత్యాచారానికి ఒడిగట్టాడన్న ఆరోపణలు డిపార్ట్‌మెంట్‌లో కలకలం సృష్టిస్తున్నాయి.
వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. 875/2022 U/s 452, 376(2), 307, 448, 365 IPC, ఆయుధాల చట్టం 1959 సెక్షన్30 కింద కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు రాచకొండకు చెందిన లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌తో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసు విచారణలో ఉండగా, పక్కా సమాచారంతో పోలీసులు నిందితుడిని ఈనెల 10న అర్థరాత్రి పట్టుకుని,11న జుడీషియల్ మెజిస్ట్రేట్ ద్వారా (15) రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపి, చర్లపల్లి జైలులో ఉంచారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి