Shooting in Bar: దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 20 మంది మృతి, పలువురికి గాయాలు
బార్‌లో పార్టీ చేసుకున్న వాళ్లపై మినీ బస్సులో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రాణాలను దక్కించుకోవడానికి చాలామంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
Shooting in Bar: దక్షిణాఫ్రికా (South Africa) రాజధాని జోహెనెస్‌బర్గ్ (Johannesburg) కాల్పులతో దద్దరిల్లింది. బార్‌లో రెండు గ్రూప్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది మరణించారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సొవెటో టౌన్‌షిప్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. కాల్పుల్లో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బార్‌లో పార్టీ చేసుకున్న వాళ్లపై మినీ బస్సులో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రాణాలను దక్కించుకోవడానికి చాలామంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
ఓ ముఠా మినీబస్ ట్యాక్సీలో వచ్చి బార్‌లో ఒక్కసారిగా కాల్పులు జరిపిందని పోలీసులు తెలిపారు. కాల్పులు జరుపుతున్న సమయంలో అక్కడ ఉన్నవారు ప్రాణాలను దక్కించుకోవడానికి పరుగులు తీసినట్లు పేర్కొన్నారు. గాయపడిన ఇతర 11 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని, అయితే వారిలో ఇద్దరు మరణించారని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక పోలీసులు చెప్పారు. బార్ సోవెటోలోని ఓర్నాల్డో జిల్లాలో, రాజధానికి ఆగ్నేయంగా ఉన్న జోహన్నెస్‌బర్గ్‌లోని అతిపెద్ద టౌన్‌షిప్‌లో ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన ఆ ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఈ దాడి చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణముందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..