TMC Recruitment 2022: టెన్త్/ఇంటర్ అర్హతతో..టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు..నెలకు రూ.లక్షకుపైగా జీతం..
టాటా మెమోరియల్ సెంటర్ (TMC Mumbai)కి చెందిన ముంబాయిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్.. ఒప్పంద ప్రాతిపదికన నర్సింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ఆఫీసర్ తదితర పోస్టుల (Nursing Supervisor Posts) భర్తీకి..
TMC Mumbai Technician Recruitment 2022: టాటా మెమోరియల్ సెంటర్ (TMC Mumbai)కి చెందిన ముంబాయిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్.. ఒప్పంద ప్రాతిపదికన నర్సింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ఆఫీసర్ తదితర పోస్టుల (Nursing Supervisor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 8
పోస్టుల వివరాలు: టెక్నీషియన్, నర్సింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.16,250ల నుంచి రూ.1,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి/ఇంటర్/జీఎన్‌ఎం/బీఎస్సీ/ఎండీ/డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ: hrd@hbchrcmzp.tmc.gov.in
ఇంటర్వ్యూ తేదీలు: జులై 5, 18, 19, 23, 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.