NGT Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (NGT).. జ్యుడీషియల్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టుల (Judicial Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

NGT Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఉద్యోగాలు..
Ngt New Delhi
Follow us

|

Updated on: Jul 12, 2022 | 8:39 AM

NGT New Delhi Judicial Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (NGT).. జ్యుడీషియల్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టుల (Judicial Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 27

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • జ్యుడీషియల్‌ అసిస్టెంట్ పోస్టులు: 6
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్‌ 1 పోస్టులు: 4
  • హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు: 1
  • లైబ్రేరియన్ పోస్టులు: 2
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్‌ 2 పోస్టులు: 9
  • స్టాఫ్‌ కార్ డ్రైవర్ పోస్టులు: 5

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌/డిగ్రీ/పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మెయిల్‌ ఐడీ: rg.ngt@nic.in

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.