- Telugu News Photo Gallery Political photos Festive mood in Deoghar as people light Diyas to welcome PM Modi over Kick Start of international airport Photos
Deoghar Airport: డియోగర్ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రానున్న మోదీ.. ప్రధానిని వెల్‌కమ్ చేస్తూ దీపాలతో మహిళలు
Deoghar Airport Inauguration: డియోగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కోల్‌కతా నుంచి డియోగర్‌కు ఫ్లైట్స్ నడుపుతామని..
Updated on: Jul 11, 2022 | 9:36 PM

ఝార్ఖండ్‌లోని డియోగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(Deoghar Airport) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం ప్రారంభించనున్నారు.

ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కోల్‌కతా నుంచి డియోగర్‌కు ఫ్లైట్స్ నడుపుతామని ఇండిగో సంస్థ ప్రకటించింది.

ఈ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA జారీ చేసింది.

A321,B737 లాంటి నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపుకునేందుకు అనుమతినిచ్చింది.

జులై 12వ తేదీ నుంచి వారానికో ఫ్లైట్ డియోగర్, కోల్‌కతా మధ్య నడిపేలాపర్మిషన్ ఇచ్చారు.

అంటే నెలకు నాలుగు విడదతలుగా నడపనున్నారు. ఈ సేవల వల్ల రెండు రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరగటంతో పాటు సమయం కూడా చాలా వరకు ఆదా అవుతుందని ఇండిగో అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు మార్గంలో అయితే డియోగర్ నుంచి కోల్‌కతాకు దాదాపు 7.5గంటల సమయం పడుతుంది…

అదే ఫ్లైట్‌లో అయితే గంటన్నరలో అక్కడికి చేరుకోవచ్చు. ఇది వ్యాపరవేత్తలతోపాటు టూరుస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ దీపాలు వెలుగించిన మహిళలు.. నెట్టింట వైరల్‌గా ఫోటోలు

దీపాలు వెలుగులతో రోడ్డు అంత చూడచక్కని రమణీయంగా ఉంది..

ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ దీపాలు వెలుగించిన మహిళలు.. నెట్టింట వైరల్‌గా ఫోటోలు




