AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఫెయిల్యూర్‌ భయంతో టీచర్‌కి మెసేజ్‌ రాసిన విద్యార్థి.. కొడుకు, కుటుంబంపై ఒట్టేసి మరీ రిక్వెస్ట్‌!

సోషల్ మీడియాలో అనేక రకాల ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్‌ అవుతుంటాయి. విద్యార్థులు ఎగ్జామ్‌ పేపర్‌లో చిత్ర విచిత్ర ఆన్సర్స్‌ రాసిన ఘటనలు గతంలో అనేకం ఇంటర్‌నెట్‌లో నవ్వులు పూయించారు. తాజాగా మరో విద్యార్థి

Viral News: ఫెయిల్యూర్‌ భయంతో టీచర్‌కి మెసేజ్‌ రాసిన విద్యార్థి.. కొడుకు, కుటుంబంపై ఒట్టేసి మరీ రిక్వెస్ట్‌!
Teacher Swear
Jyothi Gadda
|

Updated on: Jul 12, 2022 | 8:50 AM

Share

పరీక్షలో చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు.. వారు ఆ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించలేరని తెలిసిపోతుంది. దాంతో వారు పక్కవారిని అడిగి లేదంటే, కాపీ కొట్టైన పాస్‌ మార్కులు సాధించాలని ప్రయత్నిస్తారు..కానీ, ఓ విద్యార్థి మాత్రం ఏకంగా టీచర్‌కే విచిత్ర మెసేజ్‌ చేశాడు.. అది చదివిన ఉపాధ్యాయులు కంగుతిన్నారు. ఆ మెసేజ్‌ ఏంటో తెలిస్తే.. మీరు కూడా ఆశ్చర్యపోతారు. పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో సదరు విద్యార్థి ఉపాధ్యాయురాలి కుటుంబ సభ్యులు, కన్నకొడుకుపై ఒట్టువేయించుకున్నాడు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకు ఆ విద్యార్థి ఆ మెసేజ్‌లో ఏం రాసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో అనేక రకాల ఫోటోలు, వీడియోలు తరచూ వైరల్‌ అవుతుంటాయి. విద్యార్థులు ఎగ్జామ్‌ పేపర్‌లో చిత్ర విచిత్ర ఆన్సర్స్‌ రాసిన ఘటనలు గతంలో అనేకం ఇంటర్‌నెట్‌లో నవ్వులు పూయించారు. తాజాగా మరో విద్యార్థి ఉపాధ్యాయుడికి విచిత్ర సందేశం పంపాడు. పరీక్షలో ఫెయిల్‌ అవుతాననే భయంతో ఆ విద్యార్థి టీచర్‌కి ఓ నోట్‌ రాశాడు..దానికి రెండు ఎమోజీలను కూడా జత చేశాడు. ఒకటి స్మైలీ, మరొకటి హార్ట్‌ సింబల్‌. ఇక ఆ నోట్‌లో విద్యార్థి ఇలా రాశాడు.. “దయచేసి నాకు 28మార్క్‌వేసి నన్ను పాప్‌ చేయగలరు.. లేదంటే మీ మీద ఒట్టు, మీ కుటుంబ సభ్యులపై ఒట్టు, మీ కొడుకు మీద ప్రమాణం చేసి మీరు నన్ను పాస్‌ చేయగలరని అభ్యర్థించాడు. దీంతో ఆ నోట్‌ చదివిన ఉపాధ్యాయులు కంగుతిన్నారు.

అది చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తలలు పట్టుకున్నారు. ఇంతకీ వాడిని పాస్‌ చేయాలా వద్ద అనే సందిగ్ధంలో పడ్డారు టీచర్లు. అయితే ఇప్పుడు ఈ ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. లైకులు, షేర్లు చేస్తూ భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి