Viral Video: బయటకు వెళ్లే హడావుడిలో షూ వేసుకుంటున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! ఇలా కూడా జరగొచ్చు..

తొందరపడి షూస్ వేసుకుంటే లోపల ఏముందో తెలియదు. కొన్నిసార్లు చిన్న కీటకాలు లేదా గులకరాళ్లు అలాగే ఉంటాయి. దాంతో మీరు బూట్లు ధరించిన తర్వాత అసౌకర్యంగా, ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అయితే,

Viral Video: బయటకు వెళ్లే హడావుడిలో షూ వేసుకుంటున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! ఇలా కూడా జరగొచ్చు..
Dangerous Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 12, 2022 | 12:11 PM

Dangerous Snake: మీరు షూస్ వేసుకోబోతున్నారా అయితే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. తొందరపడి షూస్ వేసుకుంటే లోపల ఏముందో తెలియదు. కొన్నిసార్లు చిన్న కీటకాలు లేదా గులకరాళ్లు అలాగే ఉంటాయి. దాంతో మీరు బూట్లు ధరించిన తర్వాత అసౌకర్యంగా, ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అయితే, అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ షూలోంచి ప్రమాదకరమైన పాము బయటకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. షూ లోపల పామును చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో చిన్న క్లిప్‌ను షేర్‌ చేశారు. వర్షాకాలంలో ఎక్కడపడితే అక్కడే పాములు ప్రత్యక్షమవుతుంటాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చారు. వీడియోలో షూలో దాగివున్న పామును పట్టుకోవడానికి ఒక మహిళ షూ లోపల కర్రతో కొడుతోంది. ఆమె షూ లోపలికి ఇనుప రాడ్‌ని చొప్పించిన వెంటనే, అందులో నుండి ఒక పాము బయటకు వచ్చి మహిళపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ, ఆమె ఆ పాము నుంచి జాగ్రత్తగా తప్పించుకోగలిగింది. చివరికి పామును షూ నుండి బయటకు తీయగలిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. షూస్‌ వేసుకునేటప్పుడు అందరూ తప్పకుండా జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియోని షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో వ్యూస్‌,లైకులు సంపాదించింది. ఇలాంటి వీడియోను షేర్ చేసినందుకు చాలా మంది IFS అధికారికి ధన్యవాదాలు కూడా తెలిపారు. చాలా మంది సోషల్ మీడియాలో తమ రియాక్షన్స్ ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి