Heavy Rains: వరదలతో కొట్టుకుపోయిన కల్వర్ట్‌.. రోడ్డు దాటలేక అంబులెన్స్‌లో గర్భిణీ అవస్థలు..

భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా గర్భీణీలకు కూడా అవస్థలు తప్పటం లేదు.

Heavy Rains: వరదలతో కొట్టుకుపోయిన కల్వర్ట్‌.. రోడ్డు దాటలేక అంబులెన్స్‌లో గర్భిణీ అవస్థలు..
Heavy Rains
Follow us

|

Updated on: Jul 12, 2022 | 1:37 PM

Heavy Rains in Adilabad District: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు , వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదనీరు భారీగా చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా గర్భీణీలకు కూడా అవస్థలు తప్పటం లేదు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పురుటి నొప్పులతో అవస్థపడుతున్న గర్భిణీని అతి కష్టంమీద రోడ్డు దాటించారు స్థానికులు.

ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాగు ప్రవాహ ధాటికి అక్కడున్న కల్వర్ట్ కొట్టుకుపోయింది. కల్వర్టు కూలడంతో జల్దా గ్రామానికి రాకపోకలు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా వాగు దాట లేక అంబులెన్స్‌ కల్వర్ట్ వద్దే ఆగిపోయింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో ఇచ్చోడ మండలం జల్దా గ్రామానికి చెందిన జాధవ్ జయశ్రీ అనే గర్బిణీ అంబులెన్స్ లో చిక్కుకుపోయింది. మహిళ అవస్థ చూడలేక, అంబులెన్స్ ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో..స్థానికులతో కలిసి గర్బిణిని ఎత్తుకుని కల్వర్ట్ దాటించారు. జాతీయ రహదారిపైకి ఎక్కించి మరో అంబులెన్స్ లో ఇచ్చోడ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే, ఆదిలాబాద్, కోమరంభీం‌, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్.. జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!