Heavy rainfall : భారీ వర్షాలకు 63 మంది మృతి.. వరదలతో వణుకుతున్న జనం.. ఎక్కడంటే..?
ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షాల కారణంగా..అనేక ప్రాంతాలు నీటమునిగాయి.. వర్షాల కారణంగా గత 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు.
Heavy rainfall : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాన బీభత్సం సృష్టించింది. గుజరాత్‌లో కుంభవృష్టి వర్షాలతో అల్లకల్లోలంగా మారింది. దీంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నదులు, కాలువలు ఉప్పొంగి, రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షాల కారణంగా..అనేక ప్రాంతాలు నీటమునిగాయి.. వర్షాల కారణంగా గత 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. దాంతో జూన్ 1 నుంచి వర్షాలకు మృతి చెందిన వారి సంఖ్య 63కు చేరుకుంది. వీరిలో పిడుగులు పడి చనిపోయిన వారు, నీటిలో మునిగిపోయిన వారు, నీటిలో కొట్టుకుపోయినవారు, గోడలు, ఇండ్లు కూలి మరణించిన వారు ఉన్నారు. గరిష్టంగా 33 మంది పిడుగుపాటు కారణంగా మరణించారు.
#WATCH | Gujarat: NDRF teams and local administration carry out relief and rescue works in Valsad after the low-lying areas in the district gets flooded due to heavy rainfall (10.07) pic.twitter.com/4ZPNLzVceS
ఇవి కూడా చదవండి— ANI (@ANI) July 10, 2022
మరోవైపు రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాదిలో గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. “రాబోయే 5 రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించారు.. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర & కచ్‌లోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జూలై 15 నాటికి వర్షపాతం తీవ్రత తగ్గుతుంది” అని వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనోరమా మొహంతి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి