AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఏటీఎంల నుంచి 4 సార్ల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే రూ.173 కట్‌ అవుతాయా..? ఇందులో నిజమెంత?

Fact Check: ఏటీఎంల విషయంలో రిజర్వ్‌ బ్యాంకులు నిబంధనలను ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. కస్టమర్లకు మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఆర్బీఐ..

Fact Check: ఏటీఎంల నుంచి 4 సార్ల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే రూ.173 కట్‌ అవుతాయా..? ఇందులో నిజమెంత?
Atm
Subhash Goud
|

Updated on: Jul 12, 2022 | 1:47 PM

Share

Fact Check: ఏటీఎంల విషయంలో రిజర్వ్‌ బ్యాంకులు నిబంధనలను ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. కస్టమర్లకు మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఆర్బీఐ (RBI) గానీ, కేంద్రం గానీ దేశంలో బ్యాంకింగ్ (Banking) సౌకర్యాలలో మార్పులు చేస్తూనే ఉంటాయి. ఇందులో వివిధ సేవా ఛార్జీలు (Charges) మొదలైనవి కూడా ఉన్నాయి. సాధారణ ఏటీఎం నుంచి ఐదు సార్ల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసినట్లయితే అందుకు ఛార్జీ విధిస్తుంటాయి బ్యాంకులు. అయితే కొన్నికొన్ని ఫేక్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. వాటిని చూసిన చాలా మంది నమ్మి ఆందోళనకు గురవుతుంటారు. అలాంటిది వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అలాంటి వైరల్‌ అయ్యే పోస్టులపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఫాక్ట్‌చెక్‌ పరిశీలించి క్లెయిమ్‌ చేస్తుంటుంది.

ఇటీవల ఈ సందేశం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. అంది ఏంటంటే.. ATMల నుండి 4 విత్‌డ్రాల్స్ తర్వాత వినియోగదారులు ప్రతి లావాదేవీకి మొత్తం రూ. 173 చెల్లించాలి అనేది ఈ వైరల్‌ అవుతున్న పోస్టు సారాంశం. ఇలాంటి మెసేజ్‌ను మీరు కూడా చూసినట్లయితే ముందుగా ఇది అబద్దమా..? నిజమా..? అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

PIB ట్వీట్‌లో ఏముంది..

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న సందేశంపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) క్లారిటీ ఇచ్చింది. ఏ కస్టమర్‌ అయినా ATM నుండి 4 సార్లు కంటే ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేస్తే వారి ఖాతా నుండి 173 రూపాయలు కట్‌ అవుతాయన్నది పూర్తిగా అబద్దమని ట్విట్టర్‌ ద్వారా తేల్చి చెప్పింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇలాంటి పోస్టులు నకిలీవదని ఫ్యాక్ట్‌ చెక్‌ స్పష్టం చేసింది. మీ బ్యాంక్ ATM నుండి ప్రతి నెలా 5 ఉచిత లావాదేవీలు చేయవచ్చు. దీని తర్వాత ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.21 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. సో.. సోషల్‌ మీడియాలో ఎవరైనా ఈ సందేశం చూసినట్లయితే ఇది ఫేక్‌ న్యూస్‌ అని గుర్తించుకోవాలి.

ATM నుండి డబ్బు విత్‌డ్రా చేయడానికి ఎంత చెల్లించాలి:

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. మీరు 5 లావాదేవీలపై ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దీని తర్వాత డబ్బును ఉపసంహరించుకున్న తర్వాత మీరు 21 రూపాయలు, జీఎస్టీ ఛార్జీని చెల్లించాలి. అయితే, బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం నుండి మినీ స్టేట్‌మెంట్ లేదా పిన్‌ని మార్చడం వరకు అన్ని ఆర్థికేతర లావాదేవీలు ఉచితం. 6 మెట్రో నగరాల్లో (ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్) 3 లావాదేవీల వరకు ఉచితం.

నాన్-మెట్రో నగరాల్లో, వినియోగదారులు 5 ATM లావాదేవీలను ఉచితంగా పొందవచ్చు. దీని తర్వాత, మెట్రో నగరాల్లో ఆర్థిక లావాదేవీలకు, ప్రతి లావాదేవీకి రూ. 21, ఆర్థికేతర లావాదేవీగా రూ. 8.50 చెల్లించాలి. లావాదేవీ రుసుముగా రూ. 173 వసూలు చేస్తున్న వైరల్ సందేశం అబద్దం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి